Officers Questioned to Chandrababu in CIT Office: స్కిల్ డెలవలప్‌మెంట్ కేసులో తెలుగుదేశం అధినేత చంద్రబాను అరాచకరీతిలో అరెస్టు చేసిన CID అధికారులు.. ఆయన్ను కోర్టులో హాజరుపరిచే విషయంలోనూ అలాగే వ‌్యవహరిస్తున్నారు. విజయవాడలోని సిట్ కార్యాలయంలో చంద్రబాబును సుదీర్ఘంగా ప్రశ్నించిన అధికారులు.. ఆయన్ను కోర్టులో ప్రవేశపెట్టడంలో జాప్యం చేశారనే విమర్శలు వెల్లువెత్తాయి. తెల్లవారుజామున ఆస్పత్రిలో వైద్య పరీక్షలు( Medical Tests for Chandrababu) నిర్వహించిన అధికారులు అనూహ్యంగా అక్కడి నుంచి కోర్టుకు కాకుండా మళ్లీ సిట్ కార్యాలయానికి తీసుకెళ్లడం దుమారం రేపుతోంది.
Chandrababu Naidu Arrest : తెలుగుదేశం అధినేత చంద్రబాబును నాటకీయ పరిణామాల మధ్య అరెస్టు చేసి నంద్యాల నుంచి విజయవాడ తరలించిన CID అధికారులు గుంటూరు జిల్లా కుంచనపల్లిలోని సిట్ కార్యాలయంలో సుదీర్ఘంగా ప్రశ్నించారు. ముందే సిద్ధం చేసుకున్న దాదాపు 20 ప్రశ్నలను ఆయన్ను అడిగినట్లు తెలుస్తోంది. తన న్యాయవాది దమ్మాలపాటి శ్రీనివాసరావు సమక్షంలో సిట్ అధికారులు అడిగిన ప్రశ్నలకు చంద్రబాబు సమాధానాలు చెప్పారు.
రాత్రి పన్నర గంటల ప్రాంతంలో విచారణ పూర్తిగా ముగించారు. మధ్యలో విరామం ఇస్తూ మొత్తంగా రెండు గంటల పాటు చంద్రబాబును విచారించారు. సిట్ చీఫ్ రఘురామిరెడ్డి, కేసు దర్యాప్తు అధికారి అధికారి ధనుంజయుడు, మరో ఇద్దరు అధికారులు..విచారణలో పాల్గొన్నారు. విచారణ ముగిసిన తర్వాత అడ్వకేట్ జనరల్ ఎస్.శ్రీరామ్, అదనపు అడ్వకేట్ జనరల్ పొన్నవోలు సుధాకర్‌రెడ్డి సిట్ కార్యాలయానికి వచ్చి దర్యాప్తు అధికారులతో మాట్లాడినట్లు సమాచారం.
చంద్రబాబును కోర్టుకు ఎప్పుడు తరలిస్తారనే అయోమయం నెలకొన్న వేళ తెల్లవారుజామున మూడు గంటల ప్రాంతంలో చంద్రబాబును విజయవాడ ప్రభుత్వాస్పత్రికి (Chandrababu Vijayawada Government Hospital) తరలించారు. అక్కడ సుమారు గంట పాటు వైద్య పరీక్షలు నిర్వహించారు. వైద్య పరీక్షల తర్వాత చంద్రబాబును ACB కోర్టుకు తరలింస్తారని అందరూ భావించినప్పటికీ అనూహ్యంగా మళ్లీ సిట్ కార్యాలయానికి తీసుకెళ్లారు.
Chandrababu Arrest in Nandyala: నంద్యాలలో చంద్రబాబు అరెస్ట్.. రోడ్డుమార్గంలో చంద్రబాబు తరలింపు
అరెస్టు చేసిన తర్వాత దాదాపు 24 గంటలు గడచినప్పటికీ రిమాండ్ తయారు కాలేదనే కారణంతోనే మరోసారి సిట్ కార్యాలయానికి తీసుకెళ్లినట్లు.... తెలుస్తోంది. అర్థరాత్రి నుంచే ACB కోర్టు వద్ద పడిగాపులు కాసిన తెలుగుదేశం న్యాయవాదులు CID అధికారుల తీరుపై ఆగ్రహం వ్యక్తంచేశారు. కేస్ డైరీ ఇవ్వకుండా కావాలనే జాప్యం చేస్తున్నారని మండిపడ్డారు.
Pawan Kalyan on Chandrababu Arrest: మంగళగిరి పార్టీ కార్యాలయానికి చేరుకున్న పవన్‌కల్యాణ్