విజయ్ మాల్యాను అప్పగించాలని బ్రిటన్ తీసుకున్న నిర్ణయాన్ని భారత్ స్వాగతించింది. చట్టపరమైన చర్యల పూర్తి కోసమే వేచిచూస్తున్నామని ఉన్నత స్థాయి ప్రభుత్వ అధికారి తెలిపారు.
ఈ పరిణామంపై అరుణ్‌జైట్లీ ట్విట్టర్ వేదికగా స్పందించారు. మాల్యాను రప్పించేందుకు మోదీ ప్రభుత్వం ముందడుగు వేసిందని.. అదే సమయంలో ప్రతిపక్షాలు శారదా కుంభకోణం. నిందితుల చుట్టూ తిరుగుతున్నాయని విమర్శించారు.
Modi Government clears one more step to get Mallya extradited while Opposition rallies around the Saradha Scamsters.
— Arun Jaitley (@arunjaitley) February 4, 2019 " class="align-text-top noRightClick twitterSection" data="
">Modi Government clears one more step to get Mallya extradited while Opposition rallies around the Saradha Scamsters.
— Arun Jaitley (@arunjaitley) February 4, 2019Modi Government clears one more step to get Mallya extradited while Opposition rallies around the Saradha Scamsters.
— Arun Jaitley (@arunjaitley) February 4, 2019
బ్రిటన్ ప్రభుత్వ నిర్ణయంపై ఫిబ్రవరి 4 నుంచి 18 వరకు అక్కడి హైకోర్టులో మాల్యా అప్పీలు చేసుకోవచ్చు.
బ్యాంకు రుణాల ఎగవేతతో పాటు విజయ్ మాల్యా మనీ లాండరింగ్ నేరారోపణలను ఎదుర్కొంటున్నారు. మాల్యా అప్పగింత ఆదేశాలపై పాకిస్థాన్ మూలాలున్న బ్రిటన్ హోం మంత్రి సాజిద్ జావిద్ ఆదివారం సంతకం చేశారు. దీనిని సోమవారం ఆ శాఖ అధికారులు ధ్రువీకరించారు.