ETV Bharat / snippets

రూ.18 వేలు లంచం తీసుకుంటూ - ఏసీబీకి చిక్కిన సరూర్​నగర్ విద్యుత్ శాఖ డీఈ

author img

By ETV Bharat Telangana Team

Published : Aug 22, 2024, 5:10 PM IST

Updated : Aug 22, 2024, 7:39 PM IST

ELECTRICITY DE BRIBE CASE IN HYD
ACB Caught Electricity DE While Taking Bribe (ETV Bharat)

ACB Caught Electricity DE While Taking Bribe : రాష్ట్రంలో ఏసీబీ ఒక్కసారిగా దూకుడు పెంచింది. గత వారమే రంగారెడ్డి జిల్లా జేసీ, సీనియర్‌ అసిస్టెంట్​ను లంచం తీసుకుంటుండగా పట్టుకున్న అధికారులు, తాజాగా వనస్థలిపురంలోని సరూర్​నగర్ విద్యుత్ శాఖ డీఈని రెడ్ ​హ్యాండెడ్​గా పట్టుకున్నారు. గురువారం రోజున ఆటోనగర్‌లోని డీఈ కార్యాలయంలో ఏసీబీ అధికారులు సోదాలు చేపట్టారు. ఈ సందర్భంగా విద్యుత్ శాఖ డీఈ రామ్మోహన్ రూ.18 వేలు లంచం తీసుకుంటూ ఏసీబీకి చిక్కారు.

అధికారులు తెలిపిన వివరాల ప్రకారం ఆగపల్లి అనే గ్రామంలో రెండు ఎకరాల వెంచర్​లో ఉన్న విద్యుత్ స్తంభాలను షిఫ్టింగ్ చేయడానికి, కొత్త ట్రాన్స్​ఫార్మర్లు పెట్టుకోవడానికి ఓ ఎలక్ట్రికల్ కాంట్రాక్టర్​ ఆన్​లైన్​లో దరఖాస్తు చేసుకున్నాడు. అయితే అది అప్రూవల్ చేసి పని ప్రారంభించడానికి రూ.18 వేలు ఇవ్వాలని ఎలక్ట్రికల్ కాంట్రాక్టర్​ను డీఈ రామ్మోహన్ డిమాండ్​ చేశారు. ఈ మేరకు సోదాలు చేపట్టిన ఏసీబీ డీఈని పట్టుకుంది.

Last Updated : Aug 22, 2024, 7:39 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.