ETV Bharat / snippets

ఫేస్​బుక్​లో పరిచయం- పెళ్లి పేరుతో అత్యాచారం

author img

By ETV Bharat Andhra Pradesh Team

Published : Jul 30, 2024, 10:41 PM IST

Hyderabad Police Arrest to Cheating Lover
Hyderabad Police Arrest to Cheating Lover (ETV Bharat)

Hyderabad Police Arrest to Cheating Lover: ప్రేమ పేరుతో ఓ యువతిని నమ్మించి అత్యాచారం చేసిన వ్యక్తిని పోలీసులు అరెస్టు చేశారు. వరంగల్ జనగామకు చెందిన స్వామి అనే వ్యక్తి ఆస్ట్రేలియాలో నివాసం ఉంటున్నట్లు మహంకాళి ఇన్​స్పెక్టర్​ పరుశురాం తెలిపారు. ఛత్తీస్​గఢ్​కు చెందిన యువతితో ఫేస్​బుక్​లో ఏర్పడిన పరిచయం ప్రేమగా మారడంతో ఇద్దరూ సికింద్రాబాద్ మహంకాళి పోలీస్ స్టేషన్ పరిధిలో ఓ హోటల్లో కలుసుకున్నారు. హోటల్లో యువతిపై స్వామి లైంగిక దాడికి పాల్పడ్డాడు.

యువతిపై అత్యాచారం చేసిన అనంతరం పెళ్లి ప్రస్తావన తీసుకురాగా, పెళ్లికి నిరాకరించిన స్వామి ఆస్ట్రేలియాకు వెళ్లేందుకు విమానాశ్రయానికి చేరుకున్నాడు. బాధిత యువతి ఫిర్యాదుతో మహంకాళి పోలీసులు ఓఆర్ఆర్, శంషాబాద్ ఎయిర్​పోర్ట్​ పోలీసులతో సంయుక్తంగా ఆపరేషన్ నిర్వహించి స్వామిని ఆస్ట్రేలియాకు వెళ్లకుండా విమానాశ్రయంలోనే ఆపి అరెస్టు చేశారు. కేసు నమోదు చేసి నిందితుడు స్వామిని రిమాండ్​కు తరలించారు.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.