Mother and Daughter Suicide in Jagtial : కుటుంబ కలహాల కారణంగా తల్లి కుమార్తె ఆత్మహత్యకు పాల్పడిన ఘటన జగిత్యాల జిల్లాలో చోటుచేసుకుంది. బాధిత కుటుంబ సభ్యులు, స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం జగిత్యాల జిల్లా సారంగాపూర్ మండలంలోని అర్పపల్లిలో బోండ్ల సురేష్ కుటుంబం నివసిస్తుంది. అయితే గత కొద్ది రోజులుగా కుటుంబంలో గొడవలు జరుగుతున్నాయి.
వరకట్న వేధింపులు - బావిలో దూకి తల్లికుమార్తె ఆత్మహత్య
![ETV Bharat Telangana Team author img](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/authors/telangana-1716536068.jpeg?imwidth=128)
Published : Jun 27, 2024, 7:47 PM IST
![వరకట్న వేధింపులు - బావిలో దూకి తల్లికుమార్తె ఆత్మహత్య Mother and Daughter Suicide in Jagtial](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/27-06-2024/1200-675-21811553-thumbnail-16x9-mother-and-daughter-suicide.jpg?imwidth=3840)
ఈ క్రమంలో నాలుగేళ్ల కుమార్తె సాహితీ, తల్లి మౌనిక బావిలో దూకి ఆత్మహత్యకు పాల్పడ్డారు. మృతదేహాలను బయటకు తీసిన పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. అయితే భర్త వరకట్నం కోసం బాధితురాలిని గత కొద్ది రోజులుగా వేధిస్తున్నాడని అందుకే మౌనిక ఆత్మహత్యకు పాల్పడిందని కుటుంబ సభ్యులు ఆరోపించారు.