ETV Bharat / snippets

మెడికల్​ ఈడబ్ల్యూఎస్‌ కోటా సీట్ల కేటాయింపు జీవో నిలిపివేత- హైకోర్టు మధ్యంతర ఉత్తర్వులు

High Court on EWS Quota Seats in Medical Colleges
High Court on EWS Quota Seats in Medical Colleges (ETV Bharat)
author img

By ETV Bharat Andhra Pradesh Team

Published : Aug 13, 2024, 4:45 PM IST

High Court on EWS Quota Seats in Medical Colleges: వైద్య కళాశాలల్లో ఈడబ్ల్యూఎస్‌ కోటా సీట్ల కేటాయింపు జీవోను నిలిపివేస్తూ హైకోర్టు ఆదేశాలు ఇచ్చింది. జీవోను సవాలు చేస్తూ విద్యార్థులు వేసిన పిటిషన్‌పై హైకోర్టు విచారణ చేపట్టింది. సీట్లు పెంచాక ఈడబ్ల్యూఎస్‌ కోటాను భర్తీ చేయాలని పిటిషనర్ న్యాయవాది ఠాకూర్ వాదనలు వినిపించారు. ప్రైవేట్ కాలేజీల్లో పెంచకుండా ఈడబ్ల్యూఎస్‌ కింద సీట్లు ఇవ్వాలని ప్రభుత్వం జీవో జారీ చేసిందని ఆయన కోర్టు దృష్టికి తెచ్చారు. జీవో నిలుపుదల చేస్తూ ఆదేశాలు ఇవ్వాలని పిటిషనర్ తరఫు న్యాయవాది కోరారు. సీట్లు పెంచకుండా ఈడబ్ల్యూఎస్‌ కోటా ఇస్తే ఓపెన్ కేటగిరీ వాళ్లు నష్టపోతారని పిటిషనర్ వివరించారు. జీవోను నిలిపివేస్తూ హైకోర్టు మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది. తదుపరి విచారణ 6 వారాలకు హైకోర్టు వాయిదా వేసింది.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.