ETV Bharat / snippets

హజ్​యాత్రకు 1937 మంది దరఖాస్తు - మరోసారి అప్లికేషన్​ గడువు పెంపు

author img

By ETV Bharat Andhra Pradesh Team

Published : 18 hours ago

haj_yatra_online_application_date_extended
haj_yatra_online_application_date_extended (ETV Bharat)

Haj Yatra Online Application Date Extended : హజ్​యాత్ర కోసం ఆన్‌లైన్ దరఖాస్తు నమోదు గడువును మరోసారి పొడిగించినట్లు రాష్ట్ర మైనార్టీ సంక్షేమ శాఖ మంత్రి ఫరూక్ తెలిపారు. హజ్ దరఖాస్తుల ఫారమ్‌లను పూరించడానికి కేంద్ర హజ్​కమిటీ మొదట ఆగస్టు 13వ తేదీ నుంచి సెప్టెంబర్ 9 అప్లికేషన్​కి అవకాశం కల్పించింది. ఈ గడువును ఈనెల 23వ తేదీ వరకు పొడిగించింది. తాజాగా దరఖాస్తు గడువును ఈ నెల 30వ తేదీ వరకు మరోసారి కేంద్ర హజ్​కమిటీ పొడిగించినట్లు మంత్రి ఫరూక్ పేర్కొన్నారు. హజ్ యాత్ర కోసం దరఖాస్తులు అన్నీ ఆన్‌ లైన్ ద్వారా మాత్రమే స్వీకరించడం కోసం కేంద్ర హజ్ కమిటీ దేశవ్యాప్త ప్రకటన చేసిందన్నారు. ఆంధ్రప్రదేశ్ నుంచి పవిత్రమైన హజ్ యాత్రకు వెళ్లేందుకు ఇప్పటివరకు 1937 మంది ఆన్​లైన్​లో దరఖాస్తు చేసుకున్నారని వెల్లడించారు. ఇందులో 1589 దరఖాస్తులు సవ్యంగా ఉన్నాయని తెలిపారు.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.