ETV Bharat / snippets

ఇంజినీరింగ్ తుది విడత సీట్ల కేటాయింపు పూర్తి - ఇంకా 23 వేల సీట్లు ఖాళీ

AP EAPCET
AP EAPCET (ETV Bharat)
author img

By ETV Bharat Andhra Pradesh Team

Published : Aug 26, 2024, 5:24 PM IST

AP EAPCET Counselling 2024: ఇంజినీరింగ్ ప్రవేశాలకు నిర్దేశించిన ఏపీఈఏపీసెట్ 2024 కౌన్సిలింగ్ ప్రక్రియలో భాగంగా తుది, మూడవ విడత సీట్ల కేటాయింపును పూర్తి చేసినట్లు సాంకేతిక విద్యాశాఖ సంచాలకులు, ప్రవేశాల కన్వీనర్ గుమ్మల గణేష్​కుమార్ తెలిపారు. విద్యార్థులు ఆగస్టు 26 నుంచి 30 లోపు తమకు నిర్దేశించిన కళాశాలల్లో ఆన్​లైన్​లో, వ్యక్తిగతంగా రిపోర్టు చేయాలన్నారు. అయితే జులై 19 నుంచే తరగతులు ప్రారంభం అయ్యాయన్నారు. కన్వీనర్ కోటా కింద 24 విశ్వవిద్యాలయ ఇంజినీరింగ్ కళాశాలల్లో 7047 సీట్లు ఉండగా, 5920 సీట్లు భర్తీ అయ్యాయన్నారు. 215 ప్రైవేటు కళాశాలల్లో 1,24,491 సీట్లు ఉండగా, 1,02,669 భర్తీ అయ్యాయని, 9 ప్రైవేటు విశ్వవిద్యాలయాల్లో 7950 సీట్లు ఉండగా, 7744 సీట్లు భర్తీ చేశామని తెలిపారు. మొత్తంగా 248 కళాశాలల్లో 1,39,488 సీట్లు ఉండగా, 1,16,333 సీట్లు భర్తీ అయ్యాయని, 23,155 సీట్లు మిగిలి ఉన్నాయని గణేష్ కుమార్ వివరించారు.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.