ETV Bharat / snippets

విజయవాడలో రామోజీరావు సంస్మరణ సభ - పుష్పాంజలి ఘటించిన చంద్రబాబు, పవన్

author img

By ETV Bharat Telangana Team

Published : Jun 27, 2024, 5:16 PM IST

Ramoji Rao Memorial Programme at vijayawada
Ramoji Rao Memorial Programme (ETV Bharat)

Ramoji Rao Memorial Programme : ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా ఏర్పాటు చేసిన రామోజీ గ్రూపు సంస్థల ఛైర్మన్, పద్మవిభూషణ్‌ అవార్డు గ్రహీత రామోజీరావు సంస్మరణ సభకు పలువురు పాత్రికేయ, సినీ, రాజకీయ ప్రముఖులు హాజరయ్యారు. విజయవాడ శివారు కానూరులోని అనుమోలు గార్డెన్స్‌లో ఏర్పాటు చేసిన సభకు ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు దంపతులు, ఉప ముఖ్యమంత్రి పవన్‌ కల్యాణ్, లోకేశ్‌, రామోజీరావు కుటుంబ సభ్యులు, ప్రముఖ పాత్రికేయులు ఎన్‌.రామ్, శేఖర్‌ గుప్తా, గులాబ్‌ కొఠారి, ఆ రాష్ట్ర మంత్రులు, సినీ ప్రముఖులు హాజరై పుష్పాంజలి ఘటించారు. వేదిక వద్ద రామోజీరావు జీవిత విశేషాలతో ఏర్పాటు చేసిన ఛాయా చిత్ర ప్రదర్శనను చంద్రబాబు, పవన్‌ కల్యాణ్ సహా ప్రముఖులు వీక్షించారు.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.