ETV Bharat / snippets

లైంగిక వేధింపులు ఆపై తుపాకీతో బెదిరింపులు

author img

By ETV Bharat Andhra Pradesh Team

Published : Sep 10, 2024, 8:17 PM IST

Man Halchal in Gun at Suddakuntapalli
Man Halchal in Gun at Suddakuntapalli (ETV Bharat)

Man Halchal in Gun at Suddakuntapalli : శ్రీ సత్యసాయి జిల్లాలో ఓ యువకుడు తుపాకీతో హల్​చల్​ చేశాడు. రామగిరి మండలం సుద్దుకుంటపల్లికి చెందిన గంగాధర్ అదే గ్రామానికి చెందిన ఎంపీటీసీ సభ్యురాలిని లైంగికంగా వేధింపులకు గురిచేశాడు. దీంతో బాధితురాలు అతడిపై పోలీస్​స్టేషన్​లో ఫిర్యాదు చేయగా కేసు నమోదైంది. దీంతో నిందితుడు ఆమెపై కక్ష పెంచుకున్నాడు. ఎలాగైనా వారు తనపై కేసును ఉపసహరించుకునేలా చేయాలని అనుకున్నాడు.

ఈ క్రమంలోనే ఇవాళ బాధితురాలి భర్త కేశవతో తనపై కేసును ఉపసహరించుకోవాలని గన్​తో గంగాధర్ బెదిరించాడు. దీంతో ఆగ్రహించిన కేశవ కుటుంబ సభ్యులు అతడిని చితకబాది తుపాకీని స్వాధీనం చేసుకున్నారు. అనంతరం రామగిరి పోలీసులకు అప్పగించారు. బాధితుల ఫిర్యాదుతో పోలీసులు గంగాధర్​పై కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.