ETV Bharat / snippets

పాక్ ప్లేయర్లకు గట్టి షాకిచ్చిన పీసీబీ!

author img

By ETV Bharat Telugu Team

Published : Jul 15, 2024, 8:06 PM IST

source Associated Press
PCB Central Contract (source Associated Press)

PCB Central Contract : పీసీబీ తమ ఆటగాళ్ల విషయంలో కీలక నిర్ణయం తీసుకున్నట్లు తెలిసింది. అలానే ఆటగాళ్లను క్రమశిక్షణలో పెట్టాలని నిర్ణయించినట్లు సమాచారం. ఇందుకోసం ప్లేయర్స్​ సెంట్రల్‌ కాంట్రాక్ట్‌ వ్యవధిని మూడేళ్ల నుంచి ఏడాదికి తగ్గించిందని తెలిసింది. వన్డే ప్రపంచకప్‌2023, టీ20 ప్రపంచకప్‌2024 టోర్నీ వైఫల్యాల నేపథ్యంలో బోర్డు ఈ నిర్ణయం తీసుకుందట. ఇకపై ఆటగాళ్ల ఫిట్​నెస్​, ప్రవర్తనపై ఆధారంగా ప్రతీ ఏడాది సెంట్రల్‌ కాంట్రాక్ట్‌ను రివైజ్‌ చేయాలని బోర్డు భావిస్తోందట. అయితే, పారితోషికం విషయంలో మాత్రం ఎలాంటి కోత ఉండబోదట. ఈ మేరకు పీసీబీ చైర్మన్‌ మొహ్సిన్‌ నఖ్వీ, రెడ్ బాల్​ కోచ్​ జేసన్‌ గిల్లెస్పి, వైట్​ బాల్​ కోచ్‌ గ్యారీ కిర్‌స్టెన్‌ చర్చించినట్లు సమాచారం అందింది. అలాగే పూర్తిస్థాయి ఫిట్‌నెస్‌ ఉన్న ప్లేయర్స్​కే నిరంభ్యంతర పత్రాలు ఇవ్వాలని, అది కూడా కేవలం అంతర్జాతీయంగా ‍ప్రాముఖ్యం కలిగి ఉన్న లీగ్‌లలో మాత్రమే ఆడేందుకు అనుమతినివ్వాలని యోచనలో ఉన్నారట.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.