MLA Sirishadevi Car as Ambulance for Tribals: అత్యవరసర పరిస్థితుల్లో వైద్యం అందక గిరిజనులు నానావస్థలు పడుతున్నారని ఓ టీడీపీ ఎమ్మెల్యే తన కారును అంబులెన్సుగా మార్చేశారు. ఇవాళ ప్రపంచ ఆదివాసీ దినోత్సవం సందర్భంగా గిరిజనులకు కానుకగా ఇవ్వనున్నారు. అల్లూరి జిల్లా రంపచోడవరం ఎమ్మెల్యే మిరియాల శిరీషాదేవి గిరిజనుల వైద్యం కోసం ఈ నిర్ణయం తీసుకున్నారు. రూ.9 లక్షల విలువైన తన సొంతకారును అంబులెన్స్‌గా మార్చేశారు. కారులో ప్రాథమిక వైద్య పరికరాలు సమకూర్చి వైద్య సేవలు అందుబాటులోకి తేనున్నారు. ప్రజల కోసం తన వాహనం సమకూర్చడం సంతోషంగా ఉందని ఆమె తెలిపారు.
అంబులెన్స్‌గా సొంత కారు - గిరిజనుల వైద్యం కోసం ఎమ్మెల్యే వినూత్న నిర్ణయం
By ETV Bharat Andhra Pradesh Team
Published : Aug 9, 2024, 7:16 AM IST