ETV Bharat / snippets

రష్యాకు బిగ్​ షాక్​! కస్క్‌లో మరో టౌన్​ను స్వాధీనం చేసుకున్న ఉక్రెయిన్

author img

By ETV Bharat Telugu Team

Published : Aug 16, 2024, 6:40 AM IST

Ukraine Taken Control Of Russian Town
Ukraine Taken Control Of Russian Town (Associated Press)

Ukraine Taken Control Of Russian Town : సరిహద్దు దాటి రష్యాలోని కస్క్‌ ప్రాంతంలోకి చొరబడిన ఉక్రెయిన్ బలగాలు, మరో పట్టణాన్ని తమ ఆధీనంలోకి తీసుకున్నాయి. మాస్కో సైనికులపై పైచేయి సాధించి, అక్కడి సుద్జా పట్టణాన్ని పూర్తిగా తమ నియంత్రణలోకి తీసుకున్నట్లు ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్‌స్కీ ప్రకటించారు. సుద్జాలో తమ మిలిటరీ కమాండర్ కార్యాలయాన్ని ఏర్పాటు చేయనున్నట్లు తెలిపారు. తమ సరిహద్దు ప్రాంతాలను రక్షించునేందుకే రష్యాలోకి చొరబడ్డామని వెల్లడించారు. సరిహద్దులో రష్యా సైనిక ఉనికి లేకుండా చేస్తే తమ ప్రాంతానికి భద్రత ఉంటుందని అన్నారు. మరోవైపు సుద్జాకు వాయవ్యాన 45 కిలోమీటర్ల దూరంలోని గ్లుష్కోవ్ ప్రాంతాన్నీ ప్రజలంతా ఖాళీ చేయాల్సిందిగా కస్క్ తాత్కాలిక గవర్నర్ ఆదేశాలు జారీ చేశారు. రష్యాలోని బొరిసోగ్లెబెస్క్, సావస్లీకా వైమానిక స్థావరాలపై ఉక్రెయిన్ జరిపిన డ్రోన్ దాడిలో రెండు హ్యాంగర్లు సహా కొన్ని ఇతర ప్రాంతాలు దెబ్బతిన్నాయి.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.