ETV Bharat / snippets

నిరసనలకు కారణమైన బిల్లుపై ప్రెసిడెంట్ కీలక నిర్ణయం- గ్రీన్ సిగ్నల్​కు నో!

author img

By ETV Bharat Telugu Team

Published : Jun 26, 2024, 10:05 PM IST

Kenya President
Kenya President (Getty Images)

Kenya Finance Bill 2024 Protests : పన్నులు పెంచుతూ కెన్యాలో పాలకులు తీసుకొచ్చిన ప్రతిపాదిత ఆర్థిక బిల్లుపై తాను సంతకం చేయబోనని కెన్యా అధ్యక్షుడు విలియం రూటో వెల్లడించారు. ఆ బిల్లు తీవ్ర అసంతృప్తిని కలిగించిందని తెలిపారు. తాను ప్రజల బాధలను విన్నానని చెప్పారు. అయితే ప్రతిపాదిత పన్ను సంస్కరణలకు వ్యతిరేకంగా ప్రారంభమైన నిరసనలు హింసాత్మకంగా మారాయి. పార్లమెంటులో ప్రవేశపెట్టిన వివాదాస్పద ద్రవ్య బిల్లును ఉపసంహరించుకోవాలని డిమాండ్‌ చేస్తూ మంగళవారం రాజధాని నైరోబిలో భారీ ప్రదర్శన నిర్వహించారు.

ఈ సందర్భంగా పార్లమెంటులోకి ప్రవేశించిన ఆందోళనకారులు బీభత్సం సృష్టించారు. పార్లమెంటు ప్రాంగణంలో ఉన్న భవనంలోని కుర్చీలు, బల్లలు, తలుపులు, అద్దాలను ధ్వంసం చేసి నిప్పంటించారు. భద్రతా బలగాలు కాల్పులు జరపడం వల్ల పలువురు నిరసనకారులు మృతి చెందారు. స్థానిక వైద్య సిబ్బంది కథనం ప్రకారం పది మంది వరకు ప్రాణాలు కోల్పోయారు, మరో 50 మంది గాయపడ్డారు.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.