ETV Bharat / snippets

ప్రముఖ నృత్యకారిణి యామినీ కృష్ణమూర్తి కన్నుమూత

author img

By ETV Bharat Telugu Team

Published : Aug 3, 2024, 6:57 PM IST

Updated : Aug 3, 2024, 7:11 PM IST

source ETV Bharat
Indian Dancer Yamini Krishnamurthy Died (source ETV Bharat)

Indian Dancer Yamini Krishnamurthy Died : ప్రముఖ భరతనాట్య, కూచిపూడి నర్తకి యామినీ కృష్ణమూర్తి (Yamini Krishnamurthy)(84) తుదిశ్వాస విడిచారు. వృద్ధాప్య సంబంధిత అనారోగ్య సమస్యల కారణంగా గత కొంతకాలంగా బాధపడుతున్నారామె. ఈ క్రమంలోనే దిల్లీలోని అపోలో ఆసుపత్రిలో 7 నెలల నుంచి ఐసీయూలోనే ఉన్నారు. ఈ చికిత్స తీసుకుంటున్న క్రమంలోనే శనివారం కన్నుమూశారు.

కాగా, 1940లో మదనపల్లెలో జన్మించారు యామినీ కృష్ణమూర్తి. యామినీ తన కెరీర్​లో ఎన్నో పురస్కారాలను అందుకున్నారు. 1968లో పద్మశ్రీ, 2001లో పద్మభూషణ్‌, 2016లో పద్మ విభూషణ్‌ పురస్కారాలతో కేంద్ర ప్రభుత్వం సత్కరించింది. గతంలో తితిదే ఆస్థాన నర్తకిగానూ యామినీ సేవలు అందించారు. దిల్లీలో యామినీ స్కూల్‌ ఆఫ్‌ డ్యాన్స్‌ ట్రైనింగ్ సెంటర్​ను స్థాపించి డ్యాన్స్​లో ఎంతో మందికి శిక్షణ ఇచ్చారు. ఏ ప్యాషన్‌ ఫర్‌ డ్యాన్స్‌ పేరుతో పుస్తకం కూడా రచించారు.

Last Updated : Aug 3, 2024, 7:11 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.