ETV Bharat / snippets

'విడాకులు తీసుకున్న ముస్లిం మహిళలు భరణానికి అర్హులు' సుప్రీం కీలక తీర్పు

author img

By ETV Bharat Telugu Team

Published : Jul 10, 2024, 12:03 PM IST

SC On Muslim Woman Maintenance
SC On Muslim Woman Maintenance (ANI)

SC On Muslim Woman Maintenance : మహిళలకు భరణం ఇచ్చే విషయంలో సుప్రీంకోర్టు కీలక తీర్పు వెలువరించింది. సెక్షన్ 125 ప్రకారం జీవిత భాగస్వామి నుంచి భరణం కోరే హక్కు ముస్లిం మహిళకు ఉందని సర్వోన్నత న్యాయస్థానం తీర్పు ఇచ్చింది. మతంతో సంబంధం లేకుండా వివాహిత మహిళలందరూ భరణం కోరవచ్చని స్పష్టం చేసింది. భార్యకు భరణం పొందే చట్టబద్ధమైన హక్కు సెక్షన్ 125 కల్పించిందని, ఇది ముస్లిం మహిళలకు కూడా వర్తిస్తుందని న్యాయమూర్తులు జస్టిస్‌ బీవీ నాగరత్న, జస్టిస్‌ అగస్టిన్ జార్జ్ మసిహ్‌లతో కూడిన ధర్మాసనం తీర్పునిచ్చింది.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.