ETV Bharat / snippets

NEET రీ ఎగ్జామ్ రిజల్ట్స్​ రిలీజ్​- ర్యాంక్ లిస్ట్​ ఔట్

author img

By ETV Bharat Telugu Team

Published : Jul 1, 2024, 12:12 PM IST

Neet Rank 2024
Neet Rank 2024 (Source: Getty Images)

Neet Rank Card 2024: దేశవ్యాప్తంగా వైద్య విద్యాసంస్థల్లో ప్రవేశాలకు సంబంధించిన నీట్‌ పరీక్ష సవరించిన ర్యాంకుల జాబితాను నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ-NTA ప్రకటించింది. పరీక్ష ఆలస్యమైనందుకు గ్రేస్ మార్కులు పొందిన విద్యార్థులకు జూన్‌ 23న మళ్లీ టెస్ట్​ నిర్వహించిన NTA, వాటి ఫలితాలను కూడా కలిపి ర్యాంకులను విడుదల చేసింది. మే 5న నిర్వహించిన నీట్ పరీక్షలకు దేశవ్యాప్తంగా 24లక్షల మంది హాజరయ్యారు. వారిలో 67మందికి 720కి 720 మార్కులు రావడం వల్ల వివాదం చెలరేగింది. వారిలో గ్రేస్ మార్కులు పొందిన విద్యార్థులు కూడా ఉన్నారు. గ్రేస్ మార్కులు కలపడంలో అక్రమాలు జరిగాయనే ఆరోపణలురాగా సుప్రీంకోర్టులో పలు పిటిషన్లు దాఖలయ్యాయి. సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు మళ్లీ నిర్వహించిన పరీక్షలకు 1563 మందికిగాను 813 మంది అభ్యర్థులు మాత్రమే హాజరయ్యారు. మిగిలినవారు గ్రేస్ మార్కులు లేకుండా ర్యాంకులు పొందేందుకు అంగీకరించారు. ఈ నేపథ్యంలో సవరించిన ర్యాంకుల జాబితాను NTA విడుదల చేసింది.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.