ETV Bharat / snippets

'NEETపై చర్చ జరపాల్సిందే'- పార్లమెంట్​లో 'ఇండియా' కూటమి డిమాండ్!

author img

By ETV Bharat Telugu Team

Published : Jun 27, 2024, 6:50 PM IST

INDIA Alliance
INDIA Alliance (Getty Images)

INDIA Alliance On NEET : పార్లమెంట్​లో నీట్ పరీక్ష అంశంపై చర్చ జరిపాలని విపక్ష కూటమి ఇండియా నేతలు శుక్రవారం డిమాండ్ చేయనున్నారు. ఒకవేళ చర్చకు అనుమతి ఇవ్వకపోతే, సభలోనే నిరసన తెలపనున్నారు. ఈ మేరకు దిల్లీలోని కాంగ్రెస్ పార్టీ జాతీయ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే ఇంట్లో గురువారం సాయంత్రం జరిగిన సమావేశంలో ఇండియా కూటమి నేతలు నిర్ణయం తీసుకున్నారు. రాష్ట్రపతి ప్రసంగానికి ధన్యవాద తీర్మానంపై జరిగే చర్చలో కూడా పాల్గొనాలని నిర్ణయించారు. ప్రతిపక్షాలంతా ఐక్యంగా ఉన్నాయని సమావేశం అయ్యాక రాష్ట్రీయ లోక్​తంత్రిక్ పార్టీ అధ్యక్షుడు హనుమాన్ బేనివాల్ మీడియా సమావేశంలో స్పష్టం చేశారు. పార్లమెంట్​లో నీట్, అగ్నివీర్, ద్రవ్యోల్బణం, నిరుద్యోగం, MSP అంశాలను లేవనెత్తుతామని చెప్పారు.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.