ETV Bharat / snippets

భారత్ బంద్​కు మిశ్రమ స్పందన

author img

By ETV Bharat Telugu Team

Published : Aug 21, 2024, 6:58 PM IST

Bharat Bandh 21 August
Bharat Bandh 21 August (ANI)

Bharat Bandh 21 August : షెడ్యూల్డ్‌ కులాల ఉపవర్గీకరణపై సుప్రీంకోర్టు తీర్పునకు నిరసనగా బుధవారం చేపట్టిన భారత్‌ బంద్‌కు దేశవ్యాప్తంగా మిశ్రమ స్పందన లభించింది. పలు రాష్ట్రాల్లో రహదారులను దిగ్బంధించారు నిరసనకారులు. రైల్‌ రోకో కార్యక్రమాలు నిర్వహించారు. ప్రభుత్వ పాఠశాలలను మూసివేశారు.

అయితే ప్రభుత్వ కార్యాలయాలు, బ్యాంక్‌లు, వ్యాపార కార్యకలాపాలు మాత్రం యథావిధిగా కొనసాగాయి. రాజస్థాన్‌, ఛత్తీస్‌గఢ్‌, ఝార్ఖండ్‌లోని గిరిజన ఆధిక్య ప్రాంతాల మినహా మిగిలిన చోట్ల భారత్‌ బంద్‌కు మిశ్రమ స్పందన లభించింది. ఆయా రాష్ట్రాల్లో పలు మార్కెట్లు, ప్రభుత్వ పాఠశాలలు మూతపడగా, ప్రజారవాణాకు పాక్షిక అంతరాయం ఏర్పడింది. కొన్ని ప్రాంతాల్లో బంద్‌కు పిలుపునిచ్చిన ఆదివాసీ సంఘాలు సమావేశాలు, ర్యాలీలు నిర్వహించాయి.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.