'ఇది మా రాజ్యం, మేం చెప్పిందే వేదం'- గుంటూరు కాంగ్రెస్ అభ్యర్థిపై వైఎస్సార్సీపీ కార్యకర్తలు దాడి - YSRCP Attack - YSRCP ATTACK
🎬 Watch Now: Feature Video
By ETV Bharat Andhra Pradesh Team
Published : May 7, 2024, 10:01 AM IST
YSRCP Stopped Congress party Leader Mastanwali Election campaign in Guntur District : గుంటూరు తూర్పు కాంగ్రెస్ అభ్యర్థి మస్తాన్వలి ఎన్నికల ప్రచారాన్ని వైఎస్సార్సీపీ నేతలు అడ్డుకున్నారు. మస్తాన్వలి కార్యకర్తలతో కలిసి స్థానిక 50వ డివిజన్ లోని శారదాకాలనీలో ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఈ క్రమంలో 20వ లైనులోని డిప్యూటీ మేయర్ బాలవజ్రబాబు అనుచరులు, వైఎస్సార్సీపీ కార్యకర్తలు కాలనీ వాసుల పేర్లు, ఫోన్ నంబర్లు రాసుకుంటున్నారు. వారి వద్ద చీటీలతోపాటు డబ్బులు కూడా ఉన్నాయి. దీనిని గమనించిన మస్తాన్వలి వారి వద్దకు వెళ్లి పేర్లు, ఫోన్ నంబర్లు ఎందుకు రాస్తున్నారంటూ ప్రశ్నించారు. దీంతో ఇవన్నీ అడగడానికి మీరెవరంటూ ఆయనతో వైఎస్సార్సీపీ కార్యకర్తలు వాదనకు దిగారు.
ఎన్నికల నిబంధనల ప్రకారం ఓటర్ల డేటా రాయకూడదంటూ మస్తాన్వలి పేర్కొన్నారు. 'ఇది మా రాజ్యం, మేం చెప్పిందే వేదం' అంటూ మస్తాన్వలిపైకి వైఎస్సార్సీపీ కార్యకర్తలు దురుసుగా దూసుకొచ్చారు. దీనిని ఎదుర్కొనేందుకు ప్రయత్నించిన కాంగ్రెస్ పార్టీ 50వ డివిజన్ అధ్యక్షుడు భాగ్యరాజుపై దాడి చేసి కొట్టారు. భాగ్యరాజు పోలీసులకు ఫిర్యాదు చేశారు.