టీడీపీలో భారీగా చేరికలు- పసుపు కండువా కప్పుకున్న ఆర్థికమంత్రి ముఖ్య అనుచరుడు - YSRCP Leders Joining In TDP - YSRCP LEDERS JOINING IN TDP
🎬 Watch Now: Feature Video


By ETV Bharat Andhra Pradesh Team
Published : May 4, 2024, 12:25 PM IST
YSRCP Leders Joining In TDP in Nandyala District : పోలింగ్ సమయం దగ్గరపడుతున్న కొద్ది వైఎస్సార్సీపీ నుంచి తెలుగుదేశంలోకి భారీగా చేరికలు కొనసాగుతున్నాయి. నంద్యాల జిల్లా డోన్ నియోజకవర్గంలో వైఎస్సార్సీపీకి చెందిన 300మంది తెలుగుదేశంలో చేరారు. వారంతా టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థి కోట్ల సూర్యప్రకాశ్‌రెడ్డి సమక్షంలో పసుపు కండువా కప్పుకున్నారు. చనుగొండ్లలో ఆర్థిక మంత్రి ముఖ్య అనుచరుడు వెంకబరావు, పలువురు టీడీపీలో చేరారు. డోన్‌లోని 18 వ వార్డు మాజీ కౌన్సిలర్ శోభారాణి, 21వ వార్డు డీలర్ జాకీర్ హూస్సేన్ వైఎస్సార్సీపీని వీడి తెలుగుదేశం కండువా కప్పుకున్నారు.
నంద్యాల జిల్లా డోన్ మండలం ఎద్దుపెంట, తాడూరు గ్రామాలలో కోట్ల సూర్యప్రకాశ్‌రెడ్డి ప్రచారంలో పాల్గొన్నారు. భూ హక్కు చట్టం వల్ల రైతులకు చాలా ప్రమాదం జరిగే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని అనుమానం వ్యక్తం చేశారు. ఎద్దుపెంట గ్రామంలో సీపీఐ పార్టీ నుంచి 20 కుటుంబాలు కోట్ల సమక్షంలో తెలుగుదేశం పార్టీలో చేరారు. ప్యాపిలి మండలం కలచట్ల గ్రామానికి చెందిన 50 మంది వైఎస్సార్సీపీని వీడి తెలుగుదేశం పార్టీలో చేరారు.