ఇంకా సిద్ధం పోస్టర్లు - ఫొటోలు తీసిన టీడీపీ నేతలు - దాడికి వైఎస్సార్సీపీ శ్రేణుల యత్నం - TENSION IN GANNAVARAM - TENSION IN GANNAVARAM
🎬 Watch Now: Feature Video
![ETV Thumbnail thumbnail](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/22-03-2024/640-480-21049879-thumbnail-16x9-ysrcp-leaders-stopped-tdp-madhavi-car-in-gannavaram.jpg)
![ETV Bharat Andhra Pradesh Team](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/authors/andhrapradesh-1716535904.jpeg)
By ETV Bharat Andhra Pradesh Team
Published : Mar 22, 2024, 7:43 PM IST
YSRCP Leaders Stopped TDP Madhavi Car in Gannavaram : కృష్ణా జిల్లా గన్నవరంలో టెన్షన్ వాతావరణం నెలకొంది. ఇంకా రోడ్డు పక్కన వైఎస్సార్సీపీ సిద్ధం పోస్టర్లు, బ్యానర్లు కనిపిస్తూనే ఉన్నారు. దీంతో టీడీపీ నేతలు ఫొటోలు తీశారు. ఇది గమనించిన వైఎస్సార్సీపీ శ్రేణులు దాడికి యత్నించారు. ఈ నేపథ్యంలో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. కడప టీడీపీ అభ్యర్థి మాధవి శనివారం వర్క్ షాప్లో పాల్గొనేందుకు కడప నుంచి గన్నవరానికి విమానంలో వచ్చారు. అనంతరం టీడీపీ కార్యాలయానికి మాధవి కారులో వెళ్తుండగా మార్గమధ్యలో సిద్ధం సభకు సంబంధించిన పోస్టర్లు, బ్యానర్లు కనిపించాయి. దీంతో ఆమె ఆగి ఫొటోలు తీసి సీ-విజిల్ యాప్‌లో అప్‌లోడ్ చేశారు. ఆమె కారు దిగి ఫొటోలు తీయడం గమనించిన వైఎస్సార్సీపీ శ్రేణులు ఆమెపై దాడికి యత్నించడంతో ఉద్రిక్తత చోటు చేసుకుంది.
Tension In Gannavaram : ఆమె వెళ్లిపోతుండగా వంశీ వర్గీయులు లారీని కారుకు అడ్డం పెట్టి అడ్డుకున్నారు. దీంతో జాతీయ రహదారిపై ట్రాఫిక్‌కు స్తంభించిపోవడంతో పోలీసులు వచ్చారు. ఈలోగా గన్నవరం తెలుగుదేశం అభ్యర్థి యార్లగడ్డ వెంకట్రావు అక్కడికి చేరుకోవడంతో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. స్టేషన్‌కు రావాలన్న పోలీసులపై మాధవీ తీవ్రంగా మండిపడ్డారు. తాను ఏం తప్పు చేశానని స్టేషన్‌కు రావాలని ప్రశ్నించారు.