కనిగిరి వైఎస్సార్సీపీలో మూడు ముక్కలాట - ఇన్చార్జి మార్పుతో వర్గపోరు
🎬 Watch Now: Feature Video
YSRCP Leaders Internal Clashes : ప్రకాశం జిల్లా కనిగిరి వైఎస్సార్సీపీలో మూడు ముక్కలాట తీవ్ర స్థాయికి చేరింది. వైఎస్సార్సీపీ అధిష్టానం కనిగిరి సిట్టింగ్ ఎమ్మెల్యేను పక్కన పెట్టి జడ్పీటీసీ దద్దాల నారాయణ యాదవ్‌ను పార్టీ ఇన్చార్జీగా ప్రకటించగా దద్దాల నారాయణ మొదటి సారిగా కనిగిరి విచ్చేయుచున్న సందర్భంలో కనిగిరి పట్టణంలో ప్రధాన రహదారులు వెంబడి పెద్ద పెద్ద ఫ్లెక్సీలను ఏర్పాటు చేశారు. ఇంతవరకు బాగానే ఉన్నప్పటికీ ఫ్లెక్సీలలో ఉన్న కొందరు అసహన నేతల ఫోటోలకు మాస్కులాగా తెల్ల పేపర్లు అంటించడం పలువురి విమర్శలకు తావిస్తోంది. ఓ పక్క సిట్టింగ్ ఎమ్మెల్యే బుర్ర మధుసూదన్‌కు మద్దతుగా ఓ వర్గం ఏర్పాటు కాగా మాజీ ఎమ్మెల్యే కదిరి బాబురావు వర్గం మరో వర్గంగా ఏర్పాటయింది.
Kanigiri YSRCP Politics : ఈ రెండు వర్గాలకు తోడు నూతనంగా ఇన్చార్జీగా ఎన్నికైన దద్దాల వర్గం కూడా వైఎస్సార్సీపీలో ఓ వర్గంగా ఏర్పడడంతో మూడు వర్గాల మధ్య అంతర్గత కుమ్ములాట నడుస్తోంది. ఏ వర్గం వారు ఎటు పోవాలో ఎవరికి మద్దతు తెలపాలో తెలియని పరిస్థితుల్లో మదన పడుతూ అంతర్గత పోరు కొనసాగుతున్నట్లు సమాచారం. వైఎస్సార్సీపీకి చెందిన కదిరి బాబురావు వర్గం ఎటు మొగ్గు చూపకుండా ఉండిపోగా సిట్టింగ్ ఎమ్మెల్యే బుర్ర మధుసూదన్ వర్గం ఎవరికి మద్దతు తెలపాలో తెలియని అయోమయ స్థితిలో ఉండిపోయింది. ఇలా ఉండగా తాజాగా కనిగిరి వైఎస్సార్సీపీ ఇన్చార్జిగా ప్రకటించిన దద్దాల నారాయణ వర్గం తమకే కనిగిరి ఎమ్మెల్యే సీటు అంటూ ఉరకలు వేస్తున్నప్పటికీ అదే పార్టీలో ఉన్న మరో రెండు వర్గాలు మద్దతు తెలపకపోవడంతో ఉన్న వర్గంతోనే సర్దుకుపోయేందుకు సిద్ధపడుతున్నారు.