ఇంటింటికీ జగనన్న స్టిక్కర్- కోడ్ మరిచిన వాలంటీర్లు, వైఎస్సార్సీపీ నాయకులు - YSRCP Election Code Voilation - YSRCP ELECTION CODE VOILATION
🎬 Watch Now: Feature Video


By ETV Bharat Andhra Pradesh Team
Published : May 7, 2024, 3:47 PM IST
|Updated : May 7, 2024, 3:54 PM IST
YSRCP Leaders Election Code Voilation in YSR District : వైఎస్సార్ జిల్లా ప్రొద్దుటూరులో వైఎస్సార్సీపీ నాయకులు ఎన్నికల కోడ్ ఉల్లంఘనలకు పాల్పడుతున్నారు. తాజాగా నిర్వహించిన ఎన్నిల ప్రచారాల్లో భాగంగా జగన్ చిత్రంతో 'మేము సిద్ధం' అని ఉన్న స్టిక్కర్‌ను ఇంటింటికీ అతికిస్తున్నారు. ప్రొద్దుటూరులోని ఈశ్వర్ రెడ్డి నగర్, పెన్నానగర్తో పాటు పలు గ్రామీణ ప్రాంతాల్లో రాజీనామా చేసిన వాలంటీర్లు, మరికొందరితో కలిసి ఈ స్టిక్కర్లు అంటించారు. ఇళ్లకు వైఎస్సార్సీపీ స్టిక్కర్లు అంటించడంపై తెలుగుదేశం అభ్యంతరం వ్యక్తం చేసింది.
ఈ విషయమై ఎన్నికల అధికారులకు ఫిర్యాదు చేసింది. వైఎస్సార్సీపీ స్టిక్కర్లు ఇళ్లకు అతికించేందుకు అనుమతి లేదని వాటిని వెంటనే తొలగిస్తామని ఎన్నికల అధికారులు తెలిపారు. ఎన్నికల కోడ్ అమలులో ఉన్నప్పుడు జగన్ చిత్రంలో ఉన్న స్టిక్కర్‌ను ఎందుకు అంటిస్తున్నారని పలువురు ప్రశ్నించగా తమకు అనుమతి ఉందని వైఎస్సార్సీపీ నాయకులు దుష్పచారం చేయడం గమనార్హం. కోడ్ అమలు లో ఉందని కూడా ఆలోచించకుండా ప్రవర్తిస్తున్న వైఎస్సార్సీపీ కార్యకర్తల తీరుపై ప్రతిపక్షాలు మండిపడుతున్నాయి.