మమ్మల్నే డబ్బులు అడుగుతావా? - టోల్ గేట్ సిబ్బందిని చితకబాదిన వైఎస్సార్సీపీ నేత - Bandapalli Tollgate
🎬 Watch Now: Feature Video
By ETV Bharat Andhra Pradesh Team
Published : Feb 7, 2024, 12:52 PM IST
|Updated : Feb 7, 2024, 1:20 PM IST
YSRCP Leader Shiva Shankar Naidu Attack on Bandapalli Toll Gate Staff : అన్నమయ్య జిల్లా రాయచోటి సమీపంలో వైఎస్సార్సీపీ నాయకులు టోల్ గేట్ సిబ్బందిపై దౌర్జన్యానికి పాల్పడ్డారు. బండ్లపల్లి టోల్ గేట్ వద్ద వాహనంలో వెళ్తున్న వైఎస్సార్సీపీ నాయకుడు శివశంకర్ నాయుడు టోల్ గేట్ సిబ్బందిపై విచక్షణా రహితంగా దాడి చేసి గాయపరిచారు. పూర్తి వివరాలివీ.
జిల్లాలోని లక్కిరెడ్డిపల్లె మండలం పాలెం వైఎస్సార్సీపీ ఎంపీటీసీ శ్రీలత భర్త శివశంకర్ నాయుడు వాహనంలో వెళ్తుండగా టోల్ గేట్ సిబ్బంది గేటు వేశారు. రుసుము చెల్లించాలని సిబ్బంది స్పష్టం చేశారు. మమ్మల్నే డబ్బులు అడుగుతావా? అంటూ ఆగ్రహించిన శివశంకర్ నాయుడు ఆయన అనుచరులు వాహనం నుంచి దిగి సిబ్బందిపై దాడి చేశారు. అడ్డు వచ్చిన మరో సిబ్బంది తల పగల గొట్టి చితకబాదారు. తీవ్ర గాయాలైన వారిని స్థానికులు ప్రభుత్వాసుపత్రికి తరలించారు. ఈ ఘటనపై సీసీ కెమెరాల్లో ఉన్న దాడి దృశ్యాలను పోలీసులు సేకరించారు. దాని ఆధారంగా శివశంకర్ నాయుడు, ఆయన అనుచరులపై రామాపురం పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. గతంలో ఇదే టోల్ గేట్ వద్ద ఓ కారుపై ఎంపీటీసీ భర్త, అతని అనుచరులు దాడి చేశారు.