ఫ్లెక్సీలను చించేసి టీడీపీ కార్యకర్తలపై వైసీపీ రౌడీల దాడి - ఆందోళన చేపట్టిన నేతలు - YSRCP Activists Destroy TDP Flexis
🎬 Watch Now: Feature Video
By ETV Bharat Andhra Pradesh Team
Published : Mar 14, 2024, 11:36 AM IST
YSRCP Activists Destroyed TDP Flexis in Sher Mohammed Pet: ఎన్నికలు దగ్గర పడుతున్న వేళ అధికారులను అడ్డు పెట్టుకుని వైసీపీ నాయకులు రెచ్చిపోతున్నారు. తెలుగుదేశం పార్టీ ఫ్లెక్సీలను చూస్తే వైసీపీ నేతలు సహించలేకపోతున్నారు. టీడీపీ ఫ్లెక్సీలు కనిపిస్తే చాలు ఏదో ఒక విధంగా తొలగిస్తున్నారు. దీనిపై ఇప్పటికే ప్రతిపక్షాలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి. తాజాగా మరో సారి టీడీపీ ఫ్లెక్సీలు చింపేయడంతో ఎన్టీఆర్ జిల్లా జగ్గయ్యపేట మండలం షేర్ మహమ్మద్ పేట గ్రామంలో ఉద్రిక్తత నెలకొంది.
గ్రామంలో ఏర్పాటు చేసిన టీడీపీ ఫ్లెక్సీలను వైసీపీ కార్యకర్తలు చింపివేశారు. బుధవారం రాత్రి ఉదయభాను పర్యటన నేపథ్యంలో కొందరు వైసీపీ కార్యకర్తలు అత్యుత్సాహం ప్రదర్శించి టీడీపీ ఫ్లెక్సీలను చింపేశారు. అడ్డుకోబోయిన టీడీపీ కార్యకర్తలపై దాడి చేసి గాయపరిచారు. దీనిని నిరసిస్తూ టీడీపీ నాయకులు, కార్యకర్తలు గ్రామంలోని ప్రధాన రహదారిపై బైఠాయించి ఆందోళన (TDP leaders protest) చేపట్టారు. చిల్లకల్లు పోలీసులు అక్కడకు రావడంతో పోలీసులకు నాయకులకు వాగ్వాదం జరిగింది.