వైఎస్సార్ ఆసరాపై సదస్సు - నేతలు ప్రసంగిస్తుండగానే జారుకున్న మహిళలు - వైఎస్సార్ ఆసరాపై మహిళా సదస్సు
🎬 Watch Now: Feature Video
By ETV Bharat Andhra Pradesh Team
Published : Feb 5, 2024, 3:36 PM IST
YSR Asara Mahila Sadassu Anantapur District : అనంతపురం జిల్లా రాయదుర్గం నియోజకవర్గంలో 4వ విడత వైఎస్సార్ ఆసరాపై మహిళా సదస్సు నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా రాయదుర్గం ఎమ్మెల్యే, ఏపీ ప్రభుత్వ విప్ కాపు రామచంద్రారెడ్డి, ఏపీఐఐసీ చైర్మన్ మెట్టు గోవింద్ రెడ్డి హాజరయ్యారు. సదస్సు జరుగుతుండగానే పెద్ద ఎత్తున మహిళలు బయటకు వెళ్లిపోయారు. వారిని మెప్మా, వైకేపీ అధికారులు బలవంతంగా సదస్సుకు తరలించారు. కార్యక్రమం మధ్యలో ప్రముఖులు మాట్లాడుతుండగానే మహిళలు వెళ్లిపోతుండగా రాయదుర్గం మున్సిపల్ ఛైర్పర్సన్ పోరాళ్లు శిల్ప, అధికారులు మహిళలను కూర్చోవాలని కోరారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్యే కాపు రామచంద్రారెడ్డి మాట్లాడుతూ తాను గడపగడపకు వెళ్లి ప్రతి మహిళను పలకరించి వచ్చానని తెలిపారు. నియోజకవర్గ ప్రజలందరూ తనకు తెలుసని పేర్కొన్నారు. ఎన్నికల అనంతరం కూడా నేను రాయదుర్గంలో ఉంటానని, ప్రజలు ఎల్లవేళలా వచ్చి తనను కలవవచ్చని వివరించారు. తాము ఎన్నికల్లో గెలుస్తామన్న ధీమా లేనట్టు రామచంద్రా రెడ్డి మాట్లాడడం గమనార్హం.