ఏపీసీసీ అధ్యక్షురాలిగా బాధ్యతలు స్వీకరించనున్న షర్మిల- ఖరారైన ముహూర్తం - ఏఐసీసీ కార్యదర్శి
🎬 Watch Now: Feature Video
By ETV Bharat Andhra Pradesh Team
Published : Jan 20, 2024, 1:05 PM IST
YS Sharmila take APCC President Charge: నూతనంగా నియమితులైన ఏపీసీసీ అధ్యక్షురాలిగా షర్మిల ఆదివారం బాధ్యతలు స్వీకరిస్తారని ఏఐసీసీ ప్రత్యేక ఆహ్వానితుడు గిడుగు రుద్రరాజు తెలిపారు. తొలుత ఇడుపులపాయలో వైఎస్ సమాధికి నివాళులర్పించి షర్మిల విజయవాడ చేరుకుంటారన్నారు. నగరంలోని ఓ కల్యాణ మండపంలో పదవీ బాధ్యతలు స్వీకరించి పీసీసీ అధ్యక్షురాలి హోదాలో ఆంధ్రరత్న భవన్లో అడుగు పెడతారన్నారు. షర్మిల పదవీ బాధ్యతల స్వీకరణ కార్యక్రమానికి ఏఐసీసీ కార్యదర్శి మయప్పన్, ఏపీ కాంగ్రెస్ పార్టీ వ్యవహారాల ఇన్‌ఛార్జ్ మాణిక్కం ఠాగూర్, ఇతర సీనియర్ కాంగ్రెస్ నేతలు హాజరు కానున్నారు. ఏపీ పీసీసీ అధ్యక్షురాలిగా వైఎస్ షర్మిలను ఎంపిక చేసినట్లు ఇటీవలె కాంగ్రెస్ అధిష్ఠానం వెల్లడించిన విషయం తెలిసిందే. రాష్ట్ర కాంగ్రెస్ అధ్యక్షుడిగా పనిచేసిన గిడుగు రుద్రరాజును సీడబ్ల్యూసీ ప్రత్యేక ఆహ్వానితుడిగా నియమిస్తూ ఏఐసీసీ నిర్ణయం తీసుకుంది.
ఏపీ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షురాలిగా షర్మిలను నియామించడంతో రాష్ట్ర రాజకీయాలు రసవత్తరంగా మారనున్నాయి. వైఎస్సార్సీపీ అధ్యక్షుడిగా జగన్, ఆయన సోదరి షర్మిల ఏపీ కాంగ్రెస్‌కు అధ్యక్షురాలిగా ఉన్నారు. రెండు వేర్వేరు పార్టీలకు అన్నాచెల్లెళ్లు అధ్యక్షులుగా ఉండటం రాష్ట్రంలో ఇదే మొదటిసారి.