విశాఖలో హఠాత్తుగా వెలసిన వైఎస్సార్ విగ్రహం - అనుమతులు లేకుండా ఏర్పాటు - YSR Statue Suddenly Arrange - YSR STATUE SUDDENLY ARRANGE
🎬 Watch Now: Feature Video


By ETV Bharat Andhra Pradesh Team
Published : Aug 26, 2024, 10:15 PM IST
YS Rajasekhar Reddy Statue Suddenly Arrange in Visakha : విశాఖ నగరం నడి బొడ్డున హఠాత్తుగా వైఎస్ రాజశేఖరరెడ్డి విగ్రహం వెలిసింది. వైఎస్సార్సీపీ నాయకుల చొరవతో రాత్రికి రాత్రే అక్కయ్యపాలెం హైవేకి అనుకుని ఉన్న స్థలంలో వైఎస్సార్ విగ్రహం (YSR Statue) ఏర్పాటైంది. అధికారంలో ఉండగా ఎటువంటి అనుమతులు లేకుండా పెద్ద ఎత్తున గ్రీన్ బెల్ట్ ప్రాంతంలో పార్టీ జెండా పోల్‌ను వైఎస్సార్సీపీ శ్రేణులు ఏర్పాటు చేశాయి.
ఇటీవల ఎన్నికల కోడ్ రావటంతో ఈ పోల్ నుంచి పార్టీ జెండాను తొలగించాల్సి వచ్చింది. దీంతో అప్పటి నుంచి వైఎస్సార్సీపీ జెండా పోల్‌లో పెట్టకపోవటంతో ఈ ప్రాంతంలో ఓపెన్ జిమ్‌తో పాటు మొక్కలు సైతం ఏర్పాటు చేశారు. అలాంటిది ఇప్పుడు రాత్రికి రాత్రే పార్టీ జెండా పోల్ స్థానంలో వైఎస్సార్ విగ్రహం పెట్టడంపై స్థానికులు విస్మయం చెందుతున్నారు. అనుమతి లేకుండా విగ్రహాలు పెడుతుంటే గ్రేటర్ విశాఖ మున్సిపల్ కార్పొరేషన్ అధికారులు ఏం చేస్తున్నారని ప్రజలు ప్రశ్నిస్తున్నారు.