ప్రొద్దుటూరులో యువకుల మధ్య ఘర్షణ - ఇద్దరికి గాయాలు - Young Men dispute - YOUNG MEN DISPUTE
🎬 Watch Now: Feature Video


By ETV Bharat Andhra Pradesh Team
Published : Apr 18, 2024, 10:13 AM IST
Young Men dispute Due to Woman in Proddatur : వైఎస్సార్ జిల్లా ప్రొద్దుటూరులో యువకుల మధ్య బుధవారం రాత్రి ఘర్షణ చోటు చేసుకుంది. స్థానిక రామేశ్వరానికి చెందిన రాజేష్, నేతాజీనగర్‌కు చెందిన మణి అనే మధ్య ఓ మహిళ విషయంలో వివాదం చెలరేగింది. దీంతో వారి మధ్య మాటామాటా పెరిగి ఘర్షణకు దారి తీసింది. ఈ క్రమంలో మణి రాజేష్, అతని తమ్ముడు సురేష్, అల్లుడు చిన్న వెంకటేష్‌లపై కత్తితో దాడి చేశాడు.
ఈ ఘటనలో సురేష్, చిన్న వెంకటేష్‌లు గాయపడ్డాడు. వారిని స్థానికులు వెంటనే ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. అనంతరం మెరుగైన వైద్యం కోసం గాంధీ రోడ్డులోని ఓ ప్రైవేటు ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. స్థానికుల ద్వారా విషయం తెలుసుకున్న సీఐ శ్రీకాంత్ సిబ్బందితో కలిసి ఆసుపత్రికి చేరుకుని ఘటనపై ఆరా తీశారు. రాజేష్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు హత్యాయత్నం కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు.