బాపట్ల యువకుడి దారుణ హత్య - విచక్షణారహితంగా కత్తులతో దాడి - Young Man Murder - YOUNG MAN MURDER
🎬 Watch Now: Feature Video
![ETV Thumbnail thumbnail](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/16-05-2024/640-480-21480454-thumbnail-16x9-young-man-murder.jpg)
![ETV Bharat Andhra Pradesh Team](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/authors/andhrapradesh-1716535904.jpeg)
By ETV Bharat Andhra Pradesh Team
Published : May 16, 2024, 10:05 AM IST
Young Man Murderd in Bapatla District : బాపట్ల పాత బస్టాండ్ కూడలి వద్ద కుప్పం ప్రశాంత్ అనే యువకుడి హత్య పట్టణంలో కలకలం రేపింది. స్థానిక ఎస్బీఐ ఏటీఎం ఎదురుగా యువకుడు నిలబడి ఉండగా కారులో వచ్చిన దుండగులు అతనిపై విచక్షణారహితంగా కత్తులతో దాడి చేసి పరారయ్యారు. తీవ్ర గాయాలైన ఆ యువకుడు అక్కడికక్కడే మృతి చెందాడు. స్థానికుల సమాచారం మేరుకు పోలీసులు సంఘటన స్థలానికి చేరుకొని పరిశీలించారు. హత్యకు సంబంధించిన వివరాలను స్థానికులను అడిగి తెలుసుకున్నారు. పాత బస్టాండ్ కూడలి, ఎస్బీఐ ఏటీఎం వద్ద ఉన్నా సీసీ కెమెరాలు పుటేజ్‌ల ఆధారంగా పోలీసు అధికారులు నిందితులను గుర్తించారు.
మృతి చెందిన ప్రశాంత్ నెల్లూరు సమీపంలో వైకుంఠపురం వాసిగా పోలీసులు గుర్తించారు. ఒక హత్య కేసులో నిందితుడిగా ఉన్న ప్రశాంత్ ఇటీవలే బెయిల్‌పై విడుదలయ్యాడు. బాపట్లలో ఉన్న తండ్రి వద్దకు వచ్చిన యువకుడిని నలుగురు దుండగులు హత్య చేసినట్లు పోలీసులు నిర్థారించారు. అతడిని పోస్టుమార్టం నిమిత్తం స్థానిక ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ప్రశాంత్‌ను చంపిన నిందితులను త్వరల్లోనే పట్టుకుంటామని డీఎస్పీ మురళీ కృష్ణ పేర్కొన్నారు.