శంకరనారాయణను ఓడించడమే నా లక్ష్యం: వైసీపీ రెబల్ అభ్యర్థి జీవీ రమణారెడ్డి - YCP Rebel GV Ramana Reddy - YCP REBEL GV RAMANA REDDY
🎬 Watch Now: Feature Video


By ETV Bharat Andhra Pradesh Team
Published : Apr 24, 2024, 1:25 PM IST
YCP Rebel Candidate GV Ramana Reddy Comment on Sankara Narayana : రానున్న ఎన్నికల్లో అనంతపురం వైసీపీ ఎంపీ అభ్యర్థిగా పోటీ చేస్తున్న ఎం.శంకర నారాయణను ఓడించడమే తమ లక్ష్యమని అధికార పార్టీ రెబల్ అభ్యర్థి, మాజీ సింగిల్ విండో అధ్యక్షుడు జీవీ రమణా రెడ్డి అన్నారు. సీఎం జగన్ మోహన్ రెడ్డి మీద ఉన్న అభిమానంతో గత ఎన్నికల్లో పెనుకొండ నియోజకవర్గం ఎమ్మెల్యేగా ఎం. శంకర నారాయణను గెలిపించామని ఈ సందర్భంగా గుర్తు చేసుకున్నారు. ఆయన ఎమ్మెల్యే అయిన తరువాత స్థానిక నాయకులపైనే కేసులు బనాయించి ఆర్థిక ఇబ్బందులు పెట్టారని ఆవేదన వ్యక్తం చేశారు.
రాష్ట్ర చరిత్రలో రెండు సార్లు చెప్పులు విసిరించుకున్న నేత శంకర్నారయణ అని జీవీ రమణా రెడ్డి ఎద్దేవా చేశారు. పెనుకొండ నియోజకవర్గంలో లేఅవుట్, ఇల్లు నిర్మాణం చేపట్టిన వారి నుంచి అక్రమంగా నగదును తీసుకున్నారని ఆరోపించారు. ఈ విషయాన్ని పార్టీ అధిష్ఠానం దృష్టికి తీసుకెళ్దామని ప్రయత్నించినా అవకాశం దొరకలేదని ఆవేదన వ్యక్తం చేశారు. ఇప్పటికైనా శంకర నారాయణను వైసీపీ అభ్యర్థిగా తొలగించాలని డిమాండ్ చేశారు. లేని పక్షంలో తాను వైసీపీ రెబల్ అభ్యర్థిగానే కొనసాగుతానని పేర్కొన్నారు.