టెక్కలి నియోజకవర్గంలో టీడీపీలోకి వలసల జోరు- పార్టీ కండువా కప్పి ఆహ్వానించిన అచ్చెన్నాయుడు - టెక్కలిలో వైసీపీ నుంచి టీడీపీ చేరిక
🎬 Watch Now: Feature Video
By ETV Bharat Andhra Pradesh Team
Published : Feb 29, 2024, 5:14 PM IST
YCP Leaders Joined TDP Party in Srikakulam District : ఎన్నికలు సమీపించిన వేళ వైఎస్సార్సీపీ నుంచి టీడీపీలోకి వలసలు జోరందుకున్నాయి. తాజాగా శ్రీకాకుళం జిల్లా టెక్కలి నియోజక వర్గంలో వైసీపీ నుంచి టీడీపీలోకి వలసలు పెద్ద ఎత్తున కొనసాగుతున్నాయి. టెక్కలి మండలం మేఘవరం పంచాయతీకి చెందిన మాజీ సర్పంచ్ అల్లు మాధవరావు వైసీపీని వీడి టీడీపీ తీర్థం పుచ్చుకున్నారు. ఆయనతో పాటు మరొ 70కి పైగా కుటుంబాలు టీడీపీలోకి చేరారు.
కోటబొమ్మాలిలోని ఎన్టీఆర్ భవన్లో టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడు వారందరికీ కండువాలు కప్పి పార్టీలోకి సాదరంగా ఆహ్వానించారు. సుమారు 70 కుటుంబాలు టీడీపీలోకి చేరడం చాలా సంతోషంగా ఉందని పేర్కొన్నారు. పార్టీలోకి చేరిన శ్రేణులతో కరచాలనం చేసి, వారితో ముచ్చటించారు. రాష్ట్రంలో రైతులు, యువత, నిరుద్యోగులు, మహిళలు, అన్ని వర్గాల ప్రజలు అభివృద్ధికి టీడీపీ పార్టీ దోహదం చేస్తుందని పేర్కొన్నారు. రాష్ట్ర అభివృద్ధి, ప్రజల సంక్షేమం చంద్రబాబుతోనే సాధ్యమవుతుందని వైసీపీని వదిలి టీడీపీలోకి చేరామని అల్లు మాధవరావు పేర్కొన్నారు.