శింగనమల వైసీపీలో భగ్గమన్న అంతర్గత విభేదాలు- పోలీసుల కళ్లు కప్పి సమావేశమైన అసమ్మతి నేతలు - YCP Leaders Group War - YCP LEADERS GROUP WAR

🎬 Watch Now: Feature Video

thumbnail

By ETV Bharat Andhra Pradesh Team

Published : Mar 26, 2024, 10:48 PM IST

YCP Leaders Group War in Anantapur District : అనంతపురం జిల్లాలోని శింగనమల మండలం శివపురం పెద్దమ్మ తల్లి ఆలయం ఆవరణలో వైసీపీ అసమ్మతి నేతలు సమావేశం నిర్వహించారు. నాలుగు రోజులుగా ఈ సమావేశంపై సమాజిక మధ్యమాల్లో విస్తృతంగా ప్రచారం జరిగింది. అయితే ఈ సమావేశాన్ని అనంతపురం నగరంలోని ఓ ఫంక్షన్ హాల్లో  నిర్వహించాల్సి ఉండాగా వైసీపీ నాయకులు పసిగట్టి ఫంక్షన్ హాల్ యజమానిని బెదిరించారు. అనంతరం పోలీసులు ఈ కార్యక్రమానికి అనుమతులు లేవంటూ  అసమ్మతి నేతలను ఎక్కడికక్కడ అడ్డుకునే ప్రయత్నం చేశారు. 

ఈ నేపథ్యంలో పోలీసుల కళ్లు కప్పి ఆలయం వద్ద అత్యవసర సమావేశాన్ని ఏర్పాటు చేశారు. సింగనమల నియోజకవర్గం వైసీపీ అభ్యర్థి వీరాంజనేయులు స్థానంలో మరొకరిని నియమించాలని డిమాండ్ చేశారు. ఆలూరి సాంబశివారెడ్డి పెత్తనాన్ని తగ్గించాలని లేనిపక్షంలో పార్టీని ఓడించేందుకు సిద్ధమవుతామని హెచ్చరించారు. అభ్యర్థిని మార్చలని ఇదివరకే  మూడు సార్లు సమావేశాలు నిర్వహించామని తెలిపారు. ఇప్పటికైన పార్టీ అధిష్టానం సరైన నిర్ణయం తీసుకోకపోతే తగిన మూల్యం చెల్లించుకోవాల్సి వస్తుందని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో వైఎస్సార్సీపీ అసమ్మతి నేతలు, కార్యకర్తలు పెద్ద ఎత్తున హాజరయ్యారు. 

ABOUT THE AUTHOR

...view details

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.