సీఎం పర్యటనకు మహిళలు తరలింపు - అల్పాహారం అందక ఇక్కట్లు - వాలంటీర్లకు వందనం కార్యక్రమం
🎬 Watch Now: Feature Video


By ETV Bharat Andhra Pradesh Team
Published : Feb 15, 2024, 8:14 PM IST
Womens Breakfast Problem in CM Jagan Phirangipuram Tour: గుంటూరు జిల్లా ఫిరంగిపురంలో సీఎం జగన్ పర్యటనలో వెలుగు, డ్వాక్రా మహిళలు అల్పాహారం అందక ఇబ్బందులు పడ్డారు. వాలంటీర్లకు వందనం కార్యక్రమం కోసం ఫిరంగిపురం మండలం పరిసర గ్రామాల నుంచి డ్వాక్రా, వెలుగు మహిళలను అధికారులు పెద్ద ఎత్తున తీసుకువచ్చారు. ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం 2 గంటల వరకు ఎలాంటి అల్పాహారం అందించని అధికారులు స్వీటు, హాటు ఇచ్చి చేతులు దులుపుకున్నారని మహిళలు ఆరోపించారు.
ఫిరంగిపురం తహసీల్దార్ కార్యాలయంలో వందలాది డ్వాక్రా, వెలుగు మహిళలు ఉండగా వారికి పూర్తి స్థాయిలో స్వీటు, హాటు ప్యాకెట్లు అందలేదు. ఉదయం నుంచి ఏమి తినని వృద్ధ మహిళలు నీరసంతో చెట్ల కింద కూర్చుండిపోయారు. కొంత మంది మాత్రమే అధికారులు ఇచ్చే స్వీటు, హాటు తీసుకోగలిగారని మిగిలిన వారికి అందే పరిస్థితి లేదని మహిళలు వాపోయారు. ఒకానొక సందర్భంలో ఆకలికి తట్టుకోలేక మహిళలు అధికారులు ఇచ్చే స్వీటు, హాటు కోసం ఎగబడ్డారు.