వాలంటీర్లపై వైసీపీ నేతల ఒత్తిడి - రాజీనామాలకు ప్రత్యేక కౌంటర్ - Volunteers Resign in YCP Meeting - VOLUNTEERS RESIGN IN YCP MEETING
🎬 Watch Now: Feature Video
By ETV Bharat Andhra Pradesh Team
Published : Apr 16, 2024, 12:30 PM IST
Volunteers Resigned in YCP MLC Meeting: ఎన్నికల్లో వాలంటీర్లను పార్టీ కార్యకర్తల్లా వాడుకునేందుకు వైసీపీ నేతలు విశ్వప్రయత్నాలు చేస్తున్నారు. అంబేడ్కర్ కోనసీమ జిల్లాలో ఎమ్మెల్సీ తోట త్రిమూర్తులు వాలంటీర్లతో రాజీనామా చేయించారు. మండపేటలో నియోజకవర్గ వైసీపీ అభ్యర్థి తోట త్రిమూర్తులు సమావేశం ఏర్పాటు చేశారు. మండపేట నియోజకవర్గంలో 1,635 మంది వాలంటీర్లు ఉండగా సమావేశానికి 1200 మంది వచ్చారు. వాలంటీర్లంతా స్వచ్ఛందంగా రాజీనామా చేసి వైసీపీ ప్రచారంలో పాల్గొనాలని త్రిమూర్తులు సూచించారు. దీంతో ఇష్టం లేకపోయినా వైసీపీ నేతల తీవ్ర ఒత్తిడితో వాలంటీర్లు రాజీనామాలు చేశారనే ఆరోపణలు ఉన్నాయి.
వాలంటీర్లతో రాజీనామాలు చేయించేందుకు గేటు వద్ద ఓ కౌంటరు ఏర్పాటు చేశారు. అప్పటికప్పుడు 900 మందికి పైగా సంతకాలు చేశారు. అనంతరం వారితో కలిసి నగరంలో ర్యాలీ నిర్వహించారు. వైసీపీ నేత సమావేశానికి, ర్యాలీకి ముందస్తుగా అనుమతి తీసుకోలేదని ఫిర్యాదు వచ్చినట్లు ఎన్నికల రిటర్నింగ్ అధికారి డీవీఎస్ ఎల్లారావు తెలిపారు. ఫ్లయింగ్ స్క్వాడ్ అధికారులు సమావేశాన్ని వీడియో తీసి ఎన్నికల అధికారులకు ఫిర్యాదు చేయగా నిబంధనల ప్రకారం చర్యలు తీసుకుంటామని తెలిపారు.