వైసీపీ నేతల మాటలు విని రాజీనామా చేశాం- గ్రామ వాలంటీర్లు ఆవేదన - Volunteers Deposed To YSRCP leaders

By ETV Bharat Andhra Pradesh Team

Published : Jun 18, 2024, 10:17 PM IST

thumbnail
'వైఎస్సార్సీపీ ప్రజాప్రతినిధుల మాటలు విని రాజీనామా చేసి రోడ్డున పడ్డాం'- గ్రామ వాలంటీర్లు ఆవేదన (ETV Bharat)

Volunteers Deposed To YSRCP Representatives: వైఎస్సార్సీపీ ప్రజాప్రతినిధుల మాటలు విని రోడ్డున పడ్డామంటూ శ్రీకాకుళం జిల్లా బూర్జ మండల అభివృద్ధి కార్యాలయం వద్ద రాజీనామా చేసిన గ్రామ వాలంటీర్లు ఆందోళనకు దిగారు. ఎన్నికల వేళ వైఎస్సార్సీపీ నాయకుల మాటలు విని నిండా మునిగామని వారు వాపోయారు. వైఎస్సార్సీపీ నేతలు బలవంతంగా తమను రాజీనామా చేయించారని వాలంటీర్లు తెలిపారు. మండల అభివృద్ధి కార్యాలయంలో ఓ సమావేశం జరుగుతుండగా వాలంటీర్లు అక్కడికి వచ్చారు. సమస్యలు చెప్పుకోవాలని చూశారు. 

అధికారులు వారిని సమావేశ మందిరంలోకి అనుమతించకపోవడంతో తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. జెడ్పీటీసీ ఛాంబర్‌లోకి వెళ్లి సర్పంచ్‌, ఎంపీటీసీ సహా అధికారులను వాలంటీర్లు నిలదీశారు. ఎన్నికల వేళ బలవంతంగా రాజీనామా చేయించారని మండిపడ్డారు. ఇప్పుడు ఎలా బతకాలంటూ జెడ్పీటీసీ, సర్పంచ్‌తో వాగ్వాదానికి దిగారు. వాలంటీర్ల ప్రశ్నలకు సమాధానాలు చెప్పలేక జెడ్పీటీసీ మౌనం దాల్చారు. ఎన్నికల ముందు వైఎస్సార్సీపీ నేతలు మాటలు వినడంతో రాజీనామా చేశామని వారు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. వాలంటీర్లపై ప్రభుత్వం సరైన నిర్ణయం తీసుకోవాలని వారు కోరుతున్నారు. 

ABOUT THE AUTHOR

...view details

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.