కాలువల సుందరీకరణ - త్వరలోనే బోటు షికారు - VMC PLAN FOR BOAT RIDE
🎬 Watch Now: Feature Video


By ETV Bharat Andhra Pradesh Team
Published : Oct 26, 2024, 3:45 PM IST
VMC Plan For Boat Ride in Bandar, Eluru, Raivas Canals : బందరు, ఏలూరు, రైవస్ కాలువల సుందరీకరణ పనులపై విజయవాడ నగరపాలక సంస్థ దృష్టి సారించింది. భవిష్యత్లో బోటు షికారు ఏర్పాటు చేసి పర్యాటకులను ఆకర్షించేందుకు ప్రయత్నం చేస్తోంది. విజయవాడ నగరంలో ప్రవహించే ప్రధాన కాలువలైన బందరు, ఏలూరు, రైవస్ కాలువలను పర్యాటకంగా అభివృద్ధి చేసేందుకు ప్రభుత్వం ప్రణాళికలు రచిస్తోంది. ఇప్పటికే ఈ కాలువల్లో ప్లాస్టిక్ వ్యర్థాలు తొలగించేందుకు వివిధ సాంకేతిక పద్ధతులు అవలంబిస్తోంది.
దీంతో పాటు ప్రజలు కాలువల్లో చెత్త వేయకుండా ఇసుప మెస్‌లను ఏర్పాటు చేశారు. కాలువల్లో చెత్త వేయకుండా ఉండేందుకు అవగాహన కోసం వంతెనల వద్ద మైక్ ఎనౌన్స్మెంట్ చేస్తున్నారు. దీంతో పాటు భవిష్యత్తులో బందరు, ఏలూరు, రైవస్ కాలువల్లో బోటు షికార్ను ఏర్పాటు చేయాలని విజయవాడ నగర పాలక సంస్థ భావిస్తోంది. దీంతో పాటు కాలువ గట్లపైనా పచ్చదనం పెంచేందుకు చర్యలు తీసుకుంటుంది. మరింత సమాచారం మా ప్రతినిధి కనకారావు అందిస్తారు.