'కనీస వ్యాయామం తప్పనిసరి'- జాతీయ వాస్కులర్ డే సందర్భంగా ర్యాలీ - National Vascular Day - NATIONAL VASCULAR DAY
🎬 Watch Now: Feature Video
By ETV Bharat Andhra Pradesh Team
Published : Aug 4, 2024, 10:49 AM IST
Vascular Society of India Awareness Program : జాతీయ వాస్కులర్ డే సందర్భంగా ఎన్టీఆర్ జిల్లా విజయవాడలో అవగాహన ర్యాలీ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో విజయవాడ సెంట్రల్, తూర్పు శాసనసభ్యులు బోండా ఉమామహేశ్వరరావు (Bonda Umamaheswara Rao), గద్దె రాంమోహన్ (Gadde Rammohan), ఎన్టీఆర్ వైద్యసేవా ట్రస్ట్ సీఈఓ లక్ష్మీ షా ముఖ్య అతిథులుగా పాల్గొన్నారు.
ప్రపంచంలో నేడు నెలకొన్న ఆధునిక జీవనశైలిలో ఎక్కువ శాతం మంది రక్తనాళాల రుగ్మతలకు గురవుతున్నారని డాక్టర్ మాకినేని కిరణ్ తెలిపారు. కనీస శారీరక సామర్థ్యం లేకపోవడం వల్ల రక్తనాళాల రుగ్మతలు వస్తున్నాయని అన్నారు. ఈ సందర్భంగా వ్యాధులపై అవగాహన కోసం వాస్కులర్ సొసైటీ ఆఫ్ ఇండియా (Vascular Society of India) ఆధ్వర్యంలో అవగాహన ర్యాలీ నిర్వహించామని తెలిపారు. రాబోయే రోజుల్లో రక్తనాళాల జబ్బులు అధికమయ్యే అవకాశం ఉండటం వలన వాటిపై అవగాహన కల్పిస్తూ ఇటువంటి ర్యాలీలు నిర్వహించడం శుభ పరిణామమని ర్యాలీలో పాల్గొన్న శాసనసభ్యులు బోండా ఉమామహేశ్వరరావు, గద్దె రామ్మోహన్ అన్నారు.