గుంటూరులో ఐక్యరాజ్యసమితి సమావేశాలు- భారత్ ప్రతిపాదనలేంటీ? - model united nations program

🎬 Watch Now: Feature Video

thumbnail

By ETV Bharat Andhra Pradesh Team

Published : Jul 20, 2024, 1:22 PM IST

Innovative Program on International Affairs at Viva School, Namburu Guntur : విద్యార్థులు అంతర్జాతీయ వ్యవహారాలు, నాయకత్వ లక్షణాల్లో నైపుణ్యాలు పెంపొందించుకునేందుకు గుంటూరు జిల్లా నంబూరులోని వివా స్కూల్లో వినూత్న కార్యక్రమం చేపట్టారు. మోడల్ యునైటెడ్‌ నేషన్స్‌ పేరిట విద్యార్థులతో సదస్సు నిర్వహించారు. ప్రపంచ దేశాలు ఎదుర్కొంటున్న సమస్యలు, వాటి పరిష్కార మార్గాల గురించి సదస్సులో చర్చించారు. ఐక్యరాజ్యసమితిలో భాగమైన ప్రతినిధుల సభ, భద్రతా మండలి, సచివాలయం, అంతర్జాతీయ న్యాయస్థానం, ఆర్థిక, సాంఘీక మండలి తరహాలో నమూనా సమావేశాలను విద్యార్థులతో ఏర్పాటు చేశారు. మూడు రోజుల పాటు జరిగే ఈ సదస్సుకు 2 తెలుగు రాష్ట్రాల్లోని వివిధ పాఠశాలల నుంచి 360 మంది విద్యార్థులు పాల్గొన్నారు. ఐరాస భద్రతా మండలిలో ఐదు దేశాలు మాత్రమే శాశ్వత సభ్యులుగా ఉన్నారని, ఆ సంఖ్యను పెంచి అందులో భారత్​కు కూడా శాశ్వత సభ్యత్వం కల్పించాల్సిన అవసరం ఉందన్న వాదన సదస్సులో వ్యక్తమైంది. అనంతరం విద్యార్థులు సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించారు. కార్యక్రమానికి నరసరావుపేట M.P లావు కృష్ణదేవరాయలు, MLC లక్ష్మణరావు, జార్ఖండ్‌ రాష్ట్ర రిటైర్డ్‌ DGP విష్ణువర్ధన్‌, వివా పాఠశాల ప్రతినిధులు హాజరయ్యారు.

ABOUT THE AUTHOR

...view details

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.