శ్రీశైలంలో ఘనంగా ఉగాది మహోత్సవాలు- రాజరాజేశ్వరిగా భ్రమరాంబికాదేవి - Ugadhi Celebrations in Srisailam - UGADHI CELEBRATIONS IN SRISAILAM
🎬 Watch Now: Feature Video
By ETV Bharat Andhra Pradesh Team
Published : Apr 10, 2024, 3:34 PM IST
Ugadhi Celebrations in Srisailam: శ్రీశైల మహా క్షేత్రంలో ఉగాది పర్వదినాన్ని పురస్కరించుకొని శ్రీ భ్రమరాంబ మల్లికార్జున స్వామివార్లకు అంగరంగ వైభవంగా రథోత్సవం జరిగింది. వివిధ రకాల పుష్పాలతో శోభాయమానంగా ముస్తాబు చేసిన రథంపై స్వామి అమ్మవార్ల ఉత్సవమూర్తులను అధిష్టింపజేశారు.
Bhramarambika Mallikharjuna Swamy Radhothsavam: అమ్మవార్ల ఉత్సవ మూర్తులను మంగళవాయిద్యాల మధ్య శ్రీశైల జగద్గురు పీఠాధిపతి, అర్చకులు, వేద పండితులు మంగళహారతులు అర్పించారు. అశేష సంఖ్యలో తరలివచ్చిన కన్నడ భక్తజనం (Kannada devotees) మధ్య రథోత్సవం రమణీయంగా సాగింది. మంగళవారం రాత్రి ఆలయ ప్రాంగణంలో భ్రమరాంబ దేవి రాజరాజేశ్వరి అలంకారంలో భక్తులకు దర్శనమిచ్చారు. అమ్మవారికి ఆలయ అర్చకులు ప్రత్యేక పూజలు నిర్వహించారు. రథోత్సవాన్ని తిలకించేందుకు అధిక సంఖ్యలో భక్తులు తరలివచ్చారు. శ్రీశైలంలో ఈరోజుతో ఉగాది మహోత్సవాలు చివరి రోజుకు చేరుకున్నాయి. రాత్రి 7 గంటలకు స్వామి, అమ్మవార్లకు అశ్వ వాహనసేవ నిర్వహించిన అనంతరం భ్రమరాంబ అమ్మవారు నిజరూప అలంకారంలో దర్శనం ఇవ్వనున్నట్టు ఆలయ అధికారులు తెలిపారు.