జగన్ రెడ్డి పేరును జలగ రెడ్డిగా మార్చుకుంటే బాగుంటుంది: తులసిరెడ్డి - YCP attack on Sharmila
🎬 Watch Now: Feature Video
![ETV Thumbnail thumbnail](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/04-02-2024/640-480-20665021-thumbnail-16x9-tulasi-reddy-on-jagan.jpg)
![ETV Bharat Andhra Pradesh Team](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/authors/andhrapradesh-1716535904.jpeg)
By ETV Bharat Andhra Pradesh Team
Published : Feb 4, 2024, 3:55 PM IST
Tulasi Reddy Allegations on CM Jagan: సీఎం జగన్ రెడ్డి తన పేరును బాదుడు రెడ్డి, జలగ రెడ్డిగా మార్చుకుంటే బాగుంటుందని కాంగ్రెస్ పార్టీ ఏపీ మీడియా ఛైర్మన్ తులసిరెడ్డి విమర్శించారు. కడప జిల్లా వేంపల్లిలో తులసి రెడ్డి మీడియాతో మాట్లాడుతూ వైసీపీ ఉన్మాదులు, పిరికి పందల పార్టీగా తయారయ్యిందని ఆగ్రహం వ్యక్తం చేశారు. వైఎస్ షర్మిల రెడ్డి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల వైఫల్యాలను ఎండగడుతుంటే సమాధానం చెప్పలేక వైసీపీ నాయకులు వ్యక్తిగత విమర్శలు చేయడం ఎంతవరకు సమంజసమన్నారు.
వైఎస్ విజయమ్మపై కూడా పరోక్షంగా వైసీపీ వారు విమర్శలు చేస్తున్నారని తులసి రెడ్డి అన్నారు. ప్రజల నిత్యావసరాలపై విపరీతమైన ధరలు పెంచి ప్రజల నడ్డి విరిచారని చెప్పారు. జగన్ రెడ్డి పేరును బాదుడు రెడ్డిగా జలగ రెడ్డిగా మార్చుకుంటే బాగుంటుందన్నారు. ప్రజలకు ఇచ్చింది గోరంత లాక్కునింది కొండంత అన్నారు. రాబోవు ఎన్నికల్లో వైసీపీ ఉన్మాద పార్టీని చిత్తుచిత్తుగా ఓడించాలని కాంగ్రెస్ పార్టీ మీడియా చైర్మన్ తులసి రెడ్డి ఆంధ్రప్రదేశ్ ప్రజలకు పిలుపునిచ్చారు.