శ్రీవారి చక్రస్నానానికి ప్రత్యేక ఏర్పాట్లు - 4 వేల మంది సిబ్బందితో భద్రత: టీటీడీ ఈవో - CHAKRA SNANAM ARRANGEMENTS TIRUMALA
🎬 Watch Now: Feature Video
By ETV Bharat Andhra Pradesh Team
Published : Oct 11, 2024, 7:35 PM IST
TTD EO Syamala Rao Interview on Chakra Snanam Arrangements in Tirumala : శ్రీవారి బ్రహ్మోత్సవాలు తిరుమలలో వైభవంగా కొనసాగుతున్నాయి. బ్రహ్మోత్సవాలలో భాగంగా రేపు (శనివారం) జరగబోయే చక్రస్నానానికి టీటీడీ ప్రత్యేక ఏర్పాట్లు చేసింది. చక్రస్నానాలను ఆచరించడానికి వచ్చే భక్తులకు ఎటువంటి ఇబ్బందులు తలెత్తకుండా టీటీడీ చర్యలు తీసుకుంది. చక్రస్నాన సమయంలో 4 వేల మంది సిబ్బందితో భక్తులకు ఎలాంటి ఇబ్బంది లేకుండా స్నానమాచరించేలా ఏర్పాట్లు చేసింది. సూక్ష్మస్ధాయి ప్రణాళికలతో చక్రస్నాన ఘట్టాన్ని విజయవంతం చేసేలా చర్యలు చేపట్టింది. ఈ భద్రత ఏర్పాట్లపై టీటీడీ ఈవో శ్యామలరావు మాట్లాడుతూ, బ్రహ్మోత్సవాల్లో సామాన్య భక్తులకు అత్యంత ప్రాధాన్యమిస్తూ అనేక సౌకర్యాలు కల్పించామని తెలిపారు.
చక్రస్నాన సమయంలో భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా హోల్డింగ్ పాయింట్లను అమలు చేస్తున్నామని తెలిపారు. ఒక విడతలో తొమ్మిది వేల మంది చక్రస్నానం చేసేలా ఏర్పాట్లు చేశామన్నారు. ఇప్పటికే దీనికి సంబంధించిన సూచనలను సంబంధిత అధికారులకు వివరించామని వెల్లడించారు. నిరంతరం టీటీడీ సిబ్బందితో పాటు పోలీసులు, ఎన్డీఆర్‌ఎఫ్, ఎస్డీఆర్‌ఎఫ్ సిబ్బంది, గజ ఈతగాళ్లు అందుబాటులో ఉంటారని తెలిపారు. అలాగే రెండు పడవల్లో ఎన్డీఆర్‌ఎఫ్ సిబ్బంది అందుబాటులో ఉంటారని ఈవో శ్యామలరావు వెల్లడించారు.