బడుగు, బలహీన వర్గాల ప్రజలకు సేవ చేసేందుకే ఎన్టీఆర్ టీడీపీని స్థాపించారు : పెమ్మసాని చంద్రశేఖర్ - Pemmasani Chandrasekhar meeting

🎬 Watch Now: Feature Video

thumbnail

By ETV Bharat Andhra Pradesh Team

Published : Feb 23, 2024, 9:05 PM IST

TDP Lok Sabha Candidate Pemmasani Chandrasekhar Meeting in Guntur District : బడుగు, బలహీన వర్గాల ప్రజలకు సేవ చేసేందుకే మహానేత ఎన్టీఆర్ తెలుగుదేశం పార్టీని ఏర్పాటు చేశారని టీడీపీ గుంటూరు పార్లమెంట్ అభ్యర్థి పెమ్మసాని చంద్రశేఖర్ అన్నారు. గుంటూరు జిల్లా పొన్నూరు మండలం చింతలపూడి గ్రామంలో నియోజకవర్గస్థాయి ముఖ్య నేతలతో సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, తెలుగుదేశం పార్టీలో ఎన్నారైగా ఉంటూ 24 సంవత్సరాల పాటు పార్టీ కోసం కృషి చేశానని తెలిపారు. అందువల్లే గుంటూరు ప్రజలకు సేవచేసే అవకాశాన్ని చంద్రబాబు నాయుడు తనకు కల్పించారన్నారు. 

జగన్ ప్రభుత్వంలో గల్లా జయదేవ్​ని ఎన్నో రకాలుగా ఇబ్బందులకు గురిచేసి రాజకీయాల నుంచి బయటకు వెళ్లేందుకు కారకులయ్యారని పేర్కొన్నారు. ఒక్క గల్లా జయదేవ్ బయటకు వెళితే వందల మంది జయదేవులు వస్తారని తెలిపారు. అదేవిధంగా ధూళిపాళ్ల నరేంద్ర గురించి మాట్లాడుతూ, టీడీపీ కార్యకర్తలకు, పాడి రైతులకు అండగా నిలిచిన బలమైన నాయకుడని తెలిపారు. అతి చిన్న వయసులోనే సంఘం డైరీ అభివృద్ధికి, పేదలకు, రైతులకు ఆయన అందించిన సేవలు ఎనలేనివన్నారు.

ABOUT THE AUTHOR

...view details

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.