29న వడ్లమూడిలో చంద్రబాబు బహిరంగ సభ - 'ఎన్టీఆర్ సభా ప్రాంగణం'గా నామకరణం - చంద్రబాబు బహిరంగ సమావేశం
🎬 Watch Now: Feature Video
![ETV Thumbnail thumbnail](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/26-01-2024/640-480-20599708-thumbnail-16x9-tdp-leaders-visit-chandrababu-meeting-ground.jpg)
![ETV Bharat Andhra Pradesh Team](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/authors/andhrapradesh-1716535904.jpeg)
By ETV Bharat Andhra Pradesh Team
Published : Jan 26, 2024, 7:35 PM IST
TDP Leaders Arrangements in Vadlamudi: గుంటూరు జిల్లాలోని వడ్లమూడి క్వారీ బాలకోటేశ్వరాలయం సమీపంలో జరిగే చంద్రబాబు రా కదలిరా బహిరంగ సభా స్థలానికి "ఎన్టీఆర్ సభా ప్రాంగణం" అని నామకరణం చేసినట్లు టీడీపీ జిల్లా అధ్యక్షుడు శ్రావణ్ కుమార్ తెలిపారు. ఈ నెల 29వ తేదీన చేబ్రోలు మండలంలో బాలకోటేశ్వరాలయం సమీపంలో చంద్రబాబు బహిరంగ సభ నిర్వహించనున్నారు. ఈ నేపథ్యంలో సభా ప్రాంగణాన్ని టీడీపీ నేతలతో పాటు జనసేన నేతలు పరిశీలించారు.
ఈనెల 29వ తేదీన మధ్యాహ్నం రెండు గంటల నుంచి జరిగే కార్యక్రమానికి చంద్రబాబు నాయుడు హాజరవుతారని శ్రావణ్ కుమార్ వెల్లడించారు. ఈ ప్రజా యాత్రకు పెద్ద ఎత్తున టీడీపీ, జనసేన కార్యకర్తల తరలి రావాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో ప్రత్తిపాడు టీడీపీ ఇంఛార్జ్ రామాంజనేయులు, గుంటూరు ఇంఛార్జ్ మసీర్ అహ్మద్, మంగళగిరి టీడీపీ నేత శ్రీనివాస్, తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడిన నేతలు సీఎం జగన్మోహన్ రెడ్డి ఉన్నవి లేనట్లు, లేనివి ఉన్నట్లు తప్పుడు ప్రచారం చేస్తున్నారన్నారు. కుల మతాల మధ్య విభేదాలు సృష్టించి చిచ్చు పెట్టాలని సీఎం చూస్తున్నారని పేర్కొన్నారు.