LIVE వైఎస్సార్సీపీ మంత్రులు జూన్ 4 తర్వాత కనిపించరు- టీడీపీ నేత బొండా ఉమా మీడియా సమావేశం- ప్రత్యక్షప్రసారం - TDP Leader Bonda Uma Press Meet - TDP LEADER BONDA UMA PRESS MEET
🎬 Watch Now: Feature Video
By ETV Bharat Andhra Pradesh Team
Published : Jun 3, 2024, 5:07 PM IST
|Updated : Jun 3, 2024, 5:20 PM IST
TDP Leader Bonda Uma Maheswara Rao Press Meet Live: జూన్ 4న ఎన్నికల కౌంటింగ్ తర్వాత వైఎస్సార్సీపీ మంత్రులు పారిపోవటం ఖాయమని టీడీపీ బ్యూరో సభ్యుడు బొండా ఉమా మహేశ్వరరావు వ్యాఖ్యానించారు. మంగళవారంతో రాష్ట్రంలో వైఎస్సార్సీపీ అరాచక పాలన అంతం అయిపోతుందని ఆశాభావం వ్యక్తం చేశారు. రాష్ట్రం అభివృద్ధి దిశగా ముందుకు సాగాలంటే చంద్రబాబు ముఖ్యమంత్రి కావటం అవసరమన్నారు. ప్రజలు కూడా ఈసారి అధికారాన్ని కూటమికే పట్టం కట్టారని అన్నారు. సైకిల్ స్పీడ్‌కు వైఎస్సార్సీపీ ఫ్యాన్ రెక్కలు విరిగిపోవడం ఖాయమని మెజార్టీ సర్వేలు కూడా తేల్చాయని వివరించారు. కొన్ని సర్వేలు కూటమిలోని తెలుగుదేశంపార్టీ ఒక్కటే అధికారానికి అవసరమైన స్థానాలు గెలుచుకోబోతున్నట్లు వెల్లడించాయని ఉమా మహేశ్వరరావు తెలిపారు. రాష్ట్రంలో హోరాహోరీగా సాగిన ఎన్నికల్లో తెలుగుదేశం కూటమి తిరుగులేని విజయాన్ని అందుకోబోతున్నట్లు వివిధ సర్వే సంస్థలు స్పష్టం చేశాయన్నారు. ఈ నేపథ్యంలో టీడీపీ నేత బొండా ఉమా మీడియా సమావేశం ప్రత్యక్షప్రసారం మీకోసం.
Last Updated : Jun 3, 2024, 5:20 PM IST