సజ్జల చెప్పారని తప్పుడు కేసులు పెడితే కుదరదు - ఇకనైనా మార్పు రావాలి: బొండా ఉమా - Bonda Comments on YCP Govt - BONDA COMMENTS ON YCP GOVT
🎬 Watch Now: Feature Video
By ETV Bharat Andhra Pradesh Team
Published : Apr 24, 2024, 12:52 PM IST
TDP Leader Bonda Uma Comments on YCP Government: వైఎస్సార్సీపీ అనుకూల పోలీసులు ఇకనైనా పార్టీ కండువాలు తీసి విధులు నిర్వహించాలని తెలుగుదేశం పొలిట్ బ్యూరో సభ్యుడు బొండా ఉమామహేశ్వరరావు హితవు పలికారు. తాడేపల్లి ప్యాలెస్ ఆదేశాలతో తనను అక్రమ కేసులో ఇరికించే యత్నం చేసిన సీపీపై ఎన్నికల సంఘం తీసుకున్న చర్యలు చూసైనా ఇతర అధికారుల్లో మార్పు రావాలని కోరారు. వైసీపీ పరిధిలో కాకుండా ఈసీ పరిధిలో ఉన్నామని పోలీసులు గుర్తించాలని ఆయన సూచించారు. తమ జోలికి వస్తే ఎవ్వరినీ ఉపేక్షించేది లేదని ఉమా స్పష్టం చేశారు.
విజయవాడ సెంట్రల్‌లో ఉన్న ఏసీపీ, సీఐలు వెలంపల్లి కనుసన్నల్లో నడుస్తున్నారని ఆయన విమర్శించారు. వారిపైనా చర్యలు కోరుతూ ఈసీకి ఫిర్యాదు చేస్తున్నట్లు వెల్లడించారు. సెర్ప్ సీఈవో మురళీధర్ రెడ్డిని తక్షణమే విధుల నుంచి తప్పించి మే 1న ఇంటి వద్దే పింఛన్లు పంపిణీ చేసేలా మార్గం సుగమం చేయాలని బొండా ఉమా డిమాండ్ చేశారు. ఎన్నికల నియమావళి ప్రకారం పోలీసులు పని చేయాలని ఆయన సూచించారు. సజ్జల చెప్పారని తమపై తప్పుడు కేసులు పెడతామంటే కుదరదని ఉమా హెచ్చరించారు.