పోలీసుల బదిలీల వెనక ఎన్నికల కుట్ర - ఎన్నికల ప్రధానాధికారికి టీడీపీ నేత అశోక్​బాబు లేఖ

By ETV Bharat Andhra Pradesh Team

Published : Feb 13, 2024, 5:12 PM IST

thumbnail

TDP Leader Ashok Babu Letter to Chief Election Officer : రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారికి టీడీపీ నేత అశోక్‌బాబు 4 లేఖలు రాశారు. పెనమలూరు నుంచి పెడనకు బదిలీ చేసిన ముగ్గురు పోలీసు అధికారులను మరోచోటుకు మార్చాలని లేఖలో పేర్కొన్నారు. అధికారులను మంత్రి జోగి రమేశ్​ పెడనకు బదిలీ చేయించారని పేర్కొన్నారు. దీని వెనక ఎన్నికల కుట్ర దాగి ఉందని ఆరోపించారు. ఆరు నెలల క్రితం రంగంపేట నియమితులైన ఎస్ఐ అధికార పార్టికీ తొత్తుగా మారారని విమర్శించారు. వైసీపీ పార్టీ నాయకుల పుట్టిన రోజు వేడుకలు పాల్గొంటూ వారితో సన్నిహితంగా ఉంటున్నాడని దుయ్యబట్టారు.

టీడీపీ, జనసేన కార్యకర్తలపై అక్రమ కేసులు పెట్టి ఎస్‌ఐ వేధిస్తున్నాడని అశోక్‌బాబు మండిపడ్డారు. వైసీపీ జడ్పీటీసీ రాంబాబు ఎన్ని అక్రమాలకు పాల్పడినా అతనిపై ఎందుకు చర్యలు తీసుకోలేదని ప్రశ్నించారు. పంటలకు సాగునీరు ఇవ్వాలని నిరసన తెలిపితే, టీడీపీ మాజీ ఎమ్మెల్యే రామకృష్ణారెడ్డి, ఇతర నాయకులపై అక్రమ కేసులు పెట్టించి వేధింపులకు గురి చేస్తున్నారన్నారు. రాష్ట్రంలో జరిగిన ఓట్ల అవకతవకలను సరి చేయాలని అశోక్‌బాబు డిమాండ్‌ చేశారు.

ABOUT THE AUTHOR

...view details

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.