'పాతపట్నం ఓట్ల జాబితాలో ఒడిశా ఓటర్లు - ప్రజాప్రతినిధుల ఒత్తిళ్లా, ఉద్యోగుల నిర్లక్షమా?' - Odisha voters in Patapatnam

🎬 Watch Now: Feature Video

thumbnail

By ETV Bharat Andhra Pradesh Team

Published : Feb 7, 2024, 12:05 PM IST

Odisha Voters in Patapatnam Constituency: శ్రీకాకుళం జిల్లా పాతపట్నం తుది ఓటరు జాబితా తప్పుల తడకగా మారిందని టీడీపీ మాజీ ఎమ్మెల్యే కలమట వెంకట రమణమూర్తి ఆరోపించారు. పాతపట్నం నియోజకవర్గంలో అక్రమంగా ఒడిశా ఓటర్లను చేర్చారని కలమట మండిపడ్డారు. దీనిపై ఎలక్షన్‌ కమిషన్‌కు ఫిర్యాదు చేసినా ఫలితం లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. అధికార పార్టీ నాయకులకు అనుకూలంగా బంధుత్వం పేరుతో ఓటర్లను హిరమండలం ఓటర్ల జాబితాలో చేర్చారని వెంకట రమణమూర్తి ఆగ్రహం వ్యక్తం చేశారు. బోగస్‌ ఓట్లకు సంబంధించిన ఆధారాలను కలమట మీడియాకు వివరించారు.

TDP Ex MLA Kalamata Venkata Ramana Murthy on Fake Votes in Srikakulam: పాతపట్నం నియోజకవర్గంలో 81 తప్పుడు ఓట్ల, ఒడిశా ఓట్ల గురించి కంప్లెయింట్ ఇచ్చి, ఆధారాలు అధికారులకు సమర్పించినా మళ్లీ ఒక ఓటు నమోదు చేశారని తెలిపారు. అధికారులు ఒత్తిడితో చేస్తున్నారా, ఉద్యోగులు నిర్లక్ష్యమా అని ఆగ్రహం వ్యక్తం చేశారు. హిరమండలంలో ఓట్ల జాబితాలో డబుల్, త్రిబుల్ ఎంట్రీ ఓట్లతో ఎన్నికలు జరిగే పరిస్థితి ఉందని ఈ విషయమై కోర్టుకు వెళ్లడానికి సిద్ధమయ్యామని కలమట తెలిపారు.

ABOUT THE AUTHOR

...view details

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.