జగన్ దిల్లీ పారిపోయి, ధర్నా చేసి అబాసు పాలయ్యారు: మాజీ మంత్రి దేవినేని ఉమా - TDP Devineni Uma Fires On YS Jagan - TDP DEVINENI UMA FIRES ON YS JAGAN
🎬 Watch Now: Feature Video
By ETV Bharat Andhra Pradesh Team
Published : Jul 26, 2024, 10:29 AM IST
TDP Devineni Uma Fires On YS Jagan Mohan Reddy : ఏపీ శాసనసభ సమావేశాలు జరుగుతుంటే పాల్గొనకుండా జగన్ దిల్లీ పారిపోయి అక్కడ ధర్నా చేసి అబాసు పాలయ్యారని మాజీ మంత్రి దేవినేని ఉమా పేర్కొన్నారు. గురువారం గొల్లపూడిలో ఆయన విలేకరులతో మాట్లాడుతూ రెడ్‌బుక్ అంటూ జగన్ కలవరిస్తున్నారని, ఆయన చేసిన దుర్మార్గాలే అందులో ఉన్నాయని పేర్కొన్నారు. శాంతి భద్రతలపై చంద్రబాబు శ్వేత పత్రం విడుదల చేస్తుంటే తాడేపల్లి ప్యాలెస్‌లో ఉన్న జగన్ ఎందుకు పాల్గొనలేదని ప్రశ్నించారు. వినుకొండలో జరిగిన ఘటనకు రాజకీయ రంగు పులిమి వారిని పరామర్శించేందుకు వెళ్లి అక్కడ పథకాల గురించి మాట్లాడటం సిగ్గు చేటన్నారు.
తప్పుడు ప్రచారాలతో బురద చల్లే కార్యక్రమంలో భాగంగా దిల్లీ వెళ్లి ధర్నా చేశారని, అక్కడ చనిపోయిన 36 మంది పేర్లు అడిగితే సమాధానం చెప్పలేకపోయారని దుయ్యబట్టారు. వైఎస్సార్సీపీ ప్రభుత్వంలో కూటమి కార్యకర్తలపై కేసులు పెడితే వాటిని చంద్రబాబు వివరాలతో సహా చూపించారన్నారు. అవినీతిపరుడు, నేరస్థుడు అయిన వ్యక్తిని శాసనమండలిలో నాయకుడిగా ఎన్నుకోవడం నేర ప్రవృత్తిని బయటపెడుతుందన్నారు. అవినీతి, అరాచకపాలనకు 11 సీట్లతో ప్రజలు బుద్ధి చెప్పినా జగన్‌లో మార్పు రాలేదన్నారు. వైఎస్సార్సీపీ భూస్థాపితం అవడానికి ఎంతో కాలం పట్టదన్నారు.